G20 Countries: పాకిస్థాన్‌ జీ20 వంటి కీలక సంస్థల్లో ఎందుకు ఒక్కసారైనా సభ్యత్వం పొందలేదు? కారణం ఇదే..

జనాభా పరంగా పాకిస్థాన్ ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశం. విస్తీర్ణంలోనూ 33 వ స్థానంలో ఉంది. తక్కువ సమయంలో అణ్వాయుధాలను తయారు చేస్తుంది. అంటే ప్రపంచంలోని అనేక దేశాల కంటే ఎక్కువ సైనిక శక్తిని కలిగి ఉంది. అయినప్పటికీ జి20 వంటి ముఖ్యమైన సంస్థలో పాకిస్థాన్ నేటికీ చోటు దక్కించుకోలేకపోయింది. అందుకు కారణాలు..

G20 Countries: పాకిస్థాన్‌ జీ20 వంటి కీలక సంస్థల్లో ఎందుకు ఒక్కసారైనా సభ్యత్వం పొందలేదు? కారణం ఇదే..
G20 Countries
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 12, 2023 | 2:47 PM

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 12: జనాభా పరంగా పాకిస్థాన్ ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశం. విస్తీర్ణంలోనూ 33 వ స్థానంలో ఉంది. తక్కువ సమయంలో అణ్వాయుధాలను తయారు చేస్తుంది. అంటే ప్రపంచంలోని అనేక దేశాల కంటే ఎక్కువ సైనిక శక్తిని కలిగి ఉంది. అయినప్పటికీ జి20 వంటి ముఖ్యమైన సంస్థలో పాకిస్థాన్ నేటికీ చోటు దక్కించుకోలేకపోయింది. అందుకు కారణాలు చాలా మందికి తెలియవు..

ప్రస్తుతం ఇందులో ఏయే దేశాలు ఉన్నాయి?

1999లో ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల సంస్థ (G20) ఏర్పడింది. అప్పట్లో అందులో కొన్ని దేశాలు మాత్రమే చేరాయి. ఆ తర్వాత మరికొన్ని దేశాలు చేరాయి. దీని మొదటి సమ్మిట్‌ 2008లో అమెరికాలో జరిగింది. ప్రస్తుతం G20లో భారత్‌తో పాటు రష్యా, బ్రెజిల్, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, చైనా, మెక్సికో, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, టర్కీ, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.

పాకిస్థాన్ ఏ స్థితిలో ఉంది?

G20 ఏర్పడినప్పుటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా పాకిస్థాన్ ప్రస్తావన లేదు. ఇటీవల కాలంలో దీని పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. పిండి, పంచదార కోసం జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఆ దేశ జనాభా 23 కోట్లు దాటింది. కానీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 350 బిలియన్ డాలర్ల దిగువనే ఉంది.

ఇవి కూడా చదవండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. జనవరి 2023 నాటికి పాకిస్తాన్ మొత్తం అప్పుటు రూ. 55 ట్రిలియన్లకు పెరిగింది. దీనితో పాటు ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి పాకిస్థాన్‌కు 3 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. బలహీణ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇప్పటికీ చాలా దేశాలు పాకిస్థాన్‌ను ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే దేశంగా చూస్తున్నాయి. G20 వంటి ముఖ్యమైన సంస్థల్లో సభ్యత్వానికి దూరంగా ఉంచడానికి ఇది కూడా ఓ పెద్ద కారణం. నిజానికి ప్రతి యేట కొత్త దేశాలు చేరాలనే నిబంధన జీ20కి లేదు. ఇది 19 దేశాలు, ఒక యూరోపియన్ యూనియన్‌తో సహా మొత్తం 20 మంది సభ్యత్వ దేశాలు కలిగి ఉంది. ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కూడా దానిలో భాగం కావడంతో 21 దేశాలు సభ్యత్వం పొందాయి. పాకిస్థాన్‌కు 22వ సభ్య దేశంగా చేరే అవకాశం మాత్రం లేదు.

భారతదేశం, చైనా గురించి మాట్లాడేటప్పుడు సరిహద్దు విషయంలో రెండు దేశాల మధ్య ఖచ్చితంగా ఉద్రిక్తత ఉంటుంది. కానీ అంతర్జాతీయ వేదికపై రెండు దేశాలు మంచి పొరుగుదేశాలుగా ఉంటాయి. ఇక టర్కీకి అనేక దేశాలతో వివాదాలు ఉన్నాయి. టర్కీ చాలాసార్లు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత కూడా ఈ దేశం ఎప్పుడూ ఉగ్రవాదాన్ని నేరుగా ప్రోత్సహించలేదు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుందో ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే పాకిస్థాన్‌పై ఉగ్రముద్ర బలంగా ఉంది.

ఆఫ్రికన్ యూనియన్ జీ 20లో 21వ సభ్యదేశంగా మారడానికి కారణం..

జి20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ 20యూనియన్‌లోకి ఆఫ్రికన్ ప్రవేశం గురించి ప్రస్తావించగా ప్రపంచ నేతలంతా అంగీకరించారు. అయితే ఆఫ్రికన్ యూనియన్‌కు సభ్యత్వం పొందడానికి ఉన్న అర్హతల గురించి మాట్లాడితే.. ఆఫ్రికా 55 దేశాల సమూహం. ఇందులో ముడిసరుకు నిల్వలు, మానవశక్తి రెండూ సమృద్ధిగా ఉన్నాయి. భవిష్యత్తులో ఆఫ్రికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను అందిస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని యూనియన్ క్లబ్‌లోకి ప్రవేశించింది.

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం