AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morocco Earthquake: నాడు చారిత్రక నగరం.. చారిత్రక కట్టడాలు, సుగంధ ద్రవ్యాలు దీని సొంతం.. నేడు శవాల దిబ్బ.. మురాకేష్ గుర్తించి తెలుసుకోండి..

ఒకప్పుడు మొరాకో రాజధాని మురాకేష్. దేశంలోని నాలుగు రాజ నగరాలలో ఇది ఒకటి. దీనిని 1070 సంవత్సరంలో పాలకుడు అమీర్ అబూ బకర్ ఇబ్న్ ఒమర్ తన రాజధానిగా ఏర్పాటు చేశాడు. ఈ నగరంలోని భవనాలను ఎర్రటి గోడలు, ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. దీంతో ఈ నగరం రెడ్ సిటీ లేదా గెరువా సిటీ అని ఖ్యాతిగాంచింది. కొన్ని సంవత్సరాల్లోనే మర్రకేష్ సాంస్కృతిక, మత , వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

Morocco Earthquake: నాడు చారిత్రక నగరం.. చారిత్రక కట్టడాలు, సుగంధ ద్రవ్యాలు దీని సొంతం.. నేడు శవాల దిబ్బ.. మురాకేష్ గుర్తించి తెలుసుకోండి..
Marrakesh Morocco
Surya Kala
|

Updated on: Sep 12, 2023 | 12:54 PM

Share

ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకోలో గత శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించింది. 8.50 లక్షల జనాభా ఉన్న మర్రకేష్ నగరం కూడా భూకంపం బారిన పడింది.. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన నగరం నేడు నామరూపాలు లేకుండా పోయింది. ఈ నగరంలో అనేక పురాతన చారిత్రాత్మక కట్టలకు నెలవు. అంతేకాదు ఈ దేశంలో జీలకర్ర, నల్ల మిరియాలు, అల్లం, పసుపు, కుంకుమపువ్వు, దాల్చినచెక్క, ఎర్ర మిరపకాయ, తెల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాల పంటలకు కూడా ప్రసిద్ధి చెందింది.

భూకంపం కేంద్రం మురాకేష్ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న హై అట్లాస్ పర్వత శ్రేణిలో ఉంది. భూ కంప తీవ్రత 6.8, ఫలితంగా.. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు చారిత్రక నగరం మర్రకేష్ తీవ్రంగా దెబ్బతింది. భారీ నష్టం చోటు  చేసుకుంది. భూకంపం సృష్టించిన విధ్వసంలో ఈ నగరం ఇప్పుడు చూడడానికి భయంకరంగా మారింది. ప్రజలు రోడ్డు పక్కనే రాత్రులు గడుపుతున్నారు. భూకంప బాధితులకు  స్థానిక ప్రభుత్వం, ప్రపంచంలోని అనేక దేశాలు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి, అయితే బాధితుల వద్దకు చేరుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు, ఎందుకంటే రోడ్డుమీద కొండచరియలు విరిగి పడడంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతదేహాలను, క్షతగాత్రులను శిథిలాల నుంచి బయటకు తీసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

దేశంలోని నాలుగు రాజ నగరాలలో ఒకటి

ఒకప్పుడు మొరాకో రాజధాని మురాకేష్. దేశంలోని నాలుగు రాజ నగరాలలో ఇది ఒకటి. దీనిని 1070 సంవత్సరంలో పాలకుడు అమీర్ అబూ బకర్ ఇబ్న్ ఒమర్ తన రాజధానిగా ఏర్పాటు చేశాడు. ఈ నగరంలోని భవనాలను ఎర్రటి గోడలు, ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. దీంతో ఈ నగరం రెడ్ సిటీ లేదా గెరువా సిటీ అని ఖ్యాతిగాంచింది. కొన్ని సంవత్సరాల్లోనే మర్రకేష్ సాంస్కృతిక, మత , వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మదీనాతో పాటు ఆఫ్రికాలో అత్యంత రద్దీగా ఉండే ఖండన, జెమా-అల్-ఫ్నా ఉన్నాయి. 12వ శతాబ్దంలో నిర్మించిన కుతుబియా మసీదు కూడా భూకంపం కారణంగా దెబ్బతింది. ఈ ప్రాంతం మొరాకోలోనే కాకుండా మొత్తం ఆఫ్రికా ఖండంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటి. మొరాకో తో పాటు .. ఈ మారకేష్ ఆఫ్రికాలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రాలు.

ఇవి కూడా చదవండి

చారిత్రక భవనాలు, తోటలు, మార్కెట్లు

ఇక్కడ చారిత్రక కట్టడాలు, ఉద్యానవనాలు, మార్కెట్‌లు స్థానిక ప్రజలను అలాగే పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఫలితంగా గత కొన్ని ఏళ్లుగా స్థానికంగా ఉండే హోటళ్లు , రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందింది. ఈ దేశం చాలా కాలం పాటు ఫ్రెంచ్ ఆక్రమణలో ఉంది. దీంతో ఇప్పటికీ అధికంగా ఫ్రెంచ్ ప్రజలు నివసిస్తున్నారు. స్థానిక భాషలో సౌక్ అని పిలువబడే సాంప్రదాయ మార్కెట్ల సంఖ్య 18. ఈ మార్కెట్లను సందర్శించకుండా పర్యాటకులు ఎవరూ తిరిగి రారు. ఈ మార్కెట్లు స్థానిక ప్రజలకు ఉపాధికి ముఖ్యమైన సాధనాలు. అంతర్జాతీయ విమానాశ్రయం, అనేక విశ్వవిద్యాలయాలు, ఫుట్‌బాల్ క్లబ్‌లు మొదలైనవి కూడా మరకేష్‌కు ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. దీని అత్యాధునిక గుర్తింపు స్ట్రీట్ సర్క్యూట్ వరల్డ్ టూరింగ్ కార్ ఛాంపియన్‌షిప్, FIA ఫార్ములా ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది.

ఏటా 20 లక్షల మంది పర్యాటకులు

20వ శతాబ్దం ప్రారంభం వరకు మొరాకోకు మరకేష్ రాజధాని అని పిలిచేవారు. సాడియన్ రాజవంశం కాలంలో ఈ నగరం అద్భుతమైన పురోగతిని సాధించింది. ప్రస్తుత రాజు గత కొన్ని సంవత్సరాలుగా  పర్యాటకులను ఆకర్షించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఫలితంగా  ఇప్పుడు ప్రతి సంవత్సరం 2 మిలియన్లకు పైగా పర్యాటకులు మరకేష్ నగరానికి వస్తున్నారు. మరకేష్ గోడలు, ఇక్కడ నిర్మించిన చారిత్రక ద్వారాలు ప్రజలను ఆకర్షిస్తాయి. మెనారా గార్డెన్ పెవిలియన్ , రిజర్వాయర్, మజోరెల్లె గార్డెన్ కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఎల్ బడి ప్యాలెస్, బహియా ప్యాలెస్, రాయల్ ప్యాలెస్, కౌటౌబియా మసీదు, బెన్ యూసఫ్ మసీదు, కస్బా మసీదు, బెన్ సలా మసీదుల వాస్తుశిల్పం పర్యాటకులను ఆకర్షిస్తాయి.

ఇంకా మట్టి కుండలను ఉపయోగించే ప్రజలు

మరాకేష్ నగరంలో నాలుగు వందలకు పైగా హోటళ్లు ఉన్నాయి. 1925 సంవత్సరంలో నిర్మించిన ఫైవ్ స్టార్ మామౌనియా హోటల్ ఆర్ట్ డెకో నగరంలోని అత్యంత ప్రసిద్ధ హోటల్. మర్రకేష్ మ్యూజియం, దార్ సి సైద్ మ్యూజియం, బెర్బెర్ మ్యూజియంతో సహా అనేక ఇతర మ్యూజియంలు ఇక్కడ ఉన్నాయి. ఈ మ్యూజియంలు నగరం పురాతన సంస్కృతి, చారిత్రక వాస్తవాల గురించి సమాచారాన్ని అందిస్తాయి. ఇక్కడ హస్తకళలు, సంగీతం, థియేటర్ , నృత్యం కూడా పర్యాటకుల మనసులో తమదైన ముద్రను వేస్తాయి. నిమ్మ, నారింజ , ఆలివ్ చెట్లు ఇక్కడ పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రాంతం ప్రత్యేకమైన మసాలా దినుసులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వంట చేసే కళ ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మట్టి పాత్రలను ఉపయోగిస్తారు. అందుకే ఇక్కడ వండే ఆహారం రుచి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..