‘వరుడు కావలెను..’ వీధుల్లో ఫ్లకార్డుతో తిరుగుతూ హల్‌చల్ చేసిన బ్యూటీ! ఇంతకీ ఎక్కడంటే..
ఏదైనా ఎప్పుడూ ఒకే విధానంలో ఎందుకు ఆలోచించాలను కుంటారు కొందరు. భిన్నరీతిలో ఆలోచించి ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. తాజాగా ఓ యంగ్ బ్యూటీ జీవిత భాగస్వామి కోసం వెదుకుతోందట. అందుకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ఏమీ వెదక్కుండా ఓ బోర్డు పట్టుకుని వీధుల్లో నిలబడి హల్‌చల్ చేసింది. సాధారణంగా వరుడు లేదా వధువుని వెదకాలంటే అదొక పెద్ద పని. ఎందరో స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి నెలల..
లండన్, సెప్టెంబర్ 12: ఏదైనా ఎప్పుడూ ఒకే విధానంలో ఎందుకు ఆలోచించాలను కుంటారు కొందరు. భిన్నరీతిలో ఆలోచించి ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. తాజాగా ఓ యంగ్ బ్యూటీ జీవిత భాగస్వామి కోసం వెదుకుతోందట. అందుకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ఏమీ వెదక్కుండా ఓ బోర్డు పట్టుకుని వీధుల్లో నిలబడి హల్‌చల్ చేసింది. సాధారణంగా వరుడు లేదా వధువుని వెదకాలంటే అదొక పెద్ద పని. ఎందరో స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి నెలల తరబడి వెదికితేగానీ చక్కని జోడు దొరకడం కష్టం. మొత్తంగా అందుకు చాలా సమయం పడుతుంది. కొంతమంది డేటింగ్ యాప్‌ల సహాయం కూడా తీసుకుంటారు. కానీ ఈ అమ్మాయి రూటు సపరేటు. అసలు ఎవరీ అమ్మాయి.. ఆమె పెళ్లి గోల ఏంటో ఓ సారి చూసేద్దాం..
లండన్‌లోని సోహోకు చెందిన కరోలినా గీట్స్ అనే రెండేళ్ల యువతి గత రెండేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఇప్పుడు తనకు 29 ఏళ్లు రావడంతో సరైన జీవిత భాగస్వామి కోసం వెదుకుతోంది. 5 అడుగుల 9 అంగులాల పొడవున్న కరోలినా వృత్తిరిత్యా మోడల్. ముందుగా చెప్పినట్లు వరుడి కోసం వెదకాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. దీంతో కరోలినా వెరైటీగా ఓ పని చేసింది. ఓ బోర్డుపై ‘లుకింగ్ ఫర్ ఎ హజ్బెండ్’ అని రాసి వీధుల్లో తిరగడం మొదలు పెట్టింది. నేను జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను.. నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలని నిర్ణయించుకున్నానంటూ మీడియాతో చెప్పుకొచ్చింది. టిండెర్, హింజ్ వంటి డేటింగ్ యాప్‌లలో నిజాయితీలేని వ్యక్తులతో నెలల తరబడి డేటింగ్ చేసి సమయాన్ని వృథా చేసుకున్నానని, దేవుడు తప్పకుండా నా ప్రయత్నాన్ని సఫలం చేస్తాడని ఆశిస్తున్నానంటూ తెల్పింది.
కాగా భర్త కోసం సెర్చ్ బోర్డ్ పట్టుకున్న కరోలినా టిక్‌టాక్ వీడియో ఫుటేజ్ 8 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అంతేకాకుండా తనకు భాగస్వామిని వెతికిపెట్టిన వారికి 5000 డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. కాగా జీవిత భాగస్వామి కోసం అమెరికా నగర వీధుల్లో ఫ్లకార్డులు పట్టుకుని తిరగడం అక్కడి వారికి కొత్తేం కాదు. 35 ఏళ్ల లాస్ ఏంజెల్స్ న్యాయవాది ఈవ్ టిల్లీ-కాల్సన్.. తనకు జీవిత భాగస్వామిని వెదికిన వారికి $5,000 బహుమతి అందిస్తానంటూ బహిరంగంగా ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.