Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Libya Floods: మరో ఆఫ్రికన్ దేశంలో వినాశనం.. వరదల్లో చిక్కుకున్న లిబియా.. 2 వేలమందికి పైగా మృతి.. సహాయం కోసం సిబ్బందిని పంపిన టర్కీ

తుఫాన్, వదల కారణంగా అనేక కార్లు నీటిలో మునిగాయి. భవనాలు కుప్పకూలాయి. రోడ్లు నదులను తలపిస్తూ నీటి ప్రవాహంతో నిండిపోయాయి. లిబియా తాజాగా పరిస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని ఒసామా హమద్ తెలిపారు. డేనియల్ తుఫాను ప్రాంతం ప్రభావం దేశం అంతటా ఉందని.. ముఖ్యంగా సముద్ర తీరప్రాంత పట్టణాల్లో విధ్వసం భారీ ఉందని.. అనేక ఇళ్ల కూలిపోయాయని తీర ప్రాంతంలోని రెండు పాత ఆనకట్టలు విరిగిపోయాయని

Libya Floods: మరో ఆఫ్రికన్ దేశంలో వినాశనం.. వరదల్లో చిక్కుకున్న లిబియా.. 2 వేలమందికి పైగా మృతి.. సహాయం కోసం సిబ్బందిని పంపిన టర్కీ
Flood In Libya
Follow us
Surya Kala

|

Updated on: Sep 12, 2023 | 11:36 AM

ఆఫ్రికన్ దేశమైన లిబియాలో తుఫాను, వరదలు భయంకరమైన విధ్వంసం సృష్టించాయి. డేనియల్ తుపాను విధ్వంసకర వరదలకు కారణమైంది. వరదలు, వర్షాల కారణంగా ఇప్పటికే 2000 మందికి పైగా మరణించారు. తూర్పు ప్రాంతంలో ఎక్కువ విధ్వంసం సంభవించినట్లు సమాచారం. తుపాను ధాటికి బహుళ అంతస్తుల భవనాలు బురదలో కూలిపోయాయి. డెర్నాలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. చాలా మంది నీటిలో కొట్టుకుపోగా, వేలాది మంది గల్లంతయ్యారు. లిబియాకు సహాయం చేయడానికి టర్కీ ముందుకొచ్చింది. సహాయక బృందాలను.. కావాలిన వస్తు సామగ్రిని నింపిన 3 విమానాలను టర్కీ పంపింది. ప్రధాని ఒసామా హమద్ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జెండాలను అర మాస్ట్‌లో ఎగురవేయాలని ఆదేశించారు. డేనియల్ తుఫాను సృష్టించిన బీభత్సంతో డెర్నాలో భారీ వినాశనం చోటు చేసుకుందని.. ఇప్పుడు ఈ నగరాన్ని విపత్తు ప్రాంతంగా ప్రకటించినట్లు తెలిపారు. లిబియా తూర్పు పార్లమెంటు-మద్దతుగల పరిపాలన అధిపతి ఒసామా హమద్ వరదల కారణంగా  మరణించిన వారి సంఖ్యను ధృవీకరించారు. కుండపోత వర్షాల కారణంగా లిబియాలో పరిస్థితి భయంకరంగా ఉందని ఒసామా తెలిపారు.

మునిగిపోయిన కార్లు, కూలిపోయిన భవనాలు, నదులను తలపిస్తున్న రోడ్లు

తుఫాన్, వదల కారణంగా అనేక కార్లు నీటిలో మునిగాయి. భవనాలు కుప్పకూలాయి. రోడ్లు నదులను తలపిస్తూ నీటి ప్రవాహంతో నిండిపోయాయి. లిబియా తాజాగా పరిస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని ఒసామా హమద్ తెలిపారు. డేనియల్ తుఫాను ప్రాంతం ప్రభావం దేశం అంతటా ఉందని.. ముఖ్యంగా సముద్ర తీరప్రాంత పట్టణాల్లో విధ్వసం భారీ ఉందని.. అనేక ఇళ్ల కూలిపోయాయని తీర ప్రాంతంలోని రెండు పాత ఆనకట్టలు విరిగిపోయాయని.. దీంతో డెర్నా పట్టణంతో బయట వ్యక్తులకు మధ్య సంబంధాలు “పూర్తిగా తెగిపోయాయని” తెలుస్తోంది. అంతేకాదు తూర్పు నగరమైన బైడాలోని ఆసుపత్రుల పరిస్థితిని తెలియజేస్తూ.. బెయిడా మెడికల్ సెంటర్ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్  చేసిన వీడియో ద్వారా అక్కడ పరిస్థితి లోకానికి తెలుస్తోంది.

డేనియల్ తుఫాను విధ్వంసం సృష్టించింది

CNN ప్రకారం ఈ వర్షం చాలా బలమైన అల్ప పీడన అవశేషాల ఫలితమని దీనిని అధికారికంగా ఆగ్నేయ ఐరోపాలోని జాతీయ వాతావరణ సంస్థలచే పేరుపెట్టబడి.. స్టార్మ్ డేనియల్ అని పిలుస్తారు. గత వారం  తుఫాను మధ్యధరా సముద్రంలోకి పయనించడానికిముందు గ్రీస్‌లో వరదలబీభత్సాన్ని సృష్టించింది. అంతేకాదు మెడికేన్ అని పిలువబడే ఉష్ణమండల తుఫానుగా మారింది.

ఇవి కూడా చదవండి

దర్నా నగరంలో భారీ విధ్వంసం

తూర్పు లిబియా ప్రభుత్వ ఆరోగ్య మంత్రి ఒత్మాన్ అబ్దుల్‌జలీల్ సోమవారం మధ్యాహ్నం మరణించిన వారి సంఖ్యను ప్రకటించారు. కనీసం 50 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఈ మృతుల సంఖ్యలో విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించిన డెర్నా నగరంలో మృతుల సంఖ్యను కలపలేదని చెప్పారు. ఇక్కడ పరిస్థితిపై ఇంకా స్పష్టంగా లేదు. మృతుల్లో తూర్పు నగరమైన బైడాకు చెందిన 12 మంది ఉన్నారని నగరంలోని ప్రధాన వైద్య కేంద్రం తెలిపింది. ఈశాన్య లిబియాలోని తీరప్రాంత నగరం సుసాలో మరో ఏడుగురు మరణించినట్లు నివేదించబడింది. షాహత్ , ఒమర్ అల్-ముక్తార్ పట్టణాలలో మరో ఏడుగురు మరణించినట్లు మంత్రి తెలిపారు.

చాలా మంది గల్లంతైనట్లు సమాచారం

ఆదివారం మరో వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. తూర్పు లిబియాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ ప్రతినిధి వాలిద్ అల్-అర్ఫీ ప్రకారం ఆ వ్యక్తి తన కారులో ఉన్నాడు. తూర్పు నగరమైన మార్జ్‌లో వరదల్లో చిక్కుకున్నాడు. మీడియా నివేదికల ప్రకారం  డజన్ల కొద్దీ ఇతర వ్యక్తులు వరదలో కొట్టుకుని పోయినట్లు పేర్కొంది. ఇలా వరదల్లో కొట్టుకుని పోయినవారు మరణించి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణ హెచ్చరిక

వరదల కారణంగా తూర్పు లిబియాలోని అనేక నగరాల్లో ఇళ్లు, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం శనివారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాత్రిపూట సంభవించిన తుఫానుకు ముందు ముందుజాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు మూసివేశారు.  వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రతికూల వాతావరణం ఉంటుందని ఆ దేశ వాతావరణ అధికారులు హెచ్చరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..