Viral News: ప్లైట్‌లో ప్రయాణీకుడికి విరేచనాలు.. జీవాయుధంతో దాడి అంటూ భయంతో వణికిన సిబ్బంది.. ఏమి చేశారంటే..
ఫ్లైట్‌రాడార్ 24 నివేదిక ప్రకారం ఎయిర్‌బస్ A350ను జార్జియాలోని అట్లాంటా నుండి బార్సిలోనా, స్పెయిన్ వెళ్లే విధంగా షెడ్యూల్ చేశారు. ఈ విమానం ప్రయాణం మొత్తం ఎనిమిది గంటలు సాగనుంది. ఈ ప్రయాణంలో సుమారు 2 గంటలు సాగింది. బయోహాజార్డ్ సమస్య అని .. తాము విమానంలో విరేచనాలతో బాధపడుతున్న ఒక ప్రయాణికుడి గురించి తెలుసుకున్నామని కనుక మేము మా విమానాన్నితిరిగి అట్లాంటాకు తీసుకుని రావాలని కోరుతున్నట్లు చెప్పారు. తాము ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నామనే సందేహంతో ఇతర ప్రయాణీకులు ప్లైట్ సిబ్బందిని ప్రశ్నించారు.
ఫ్లైట్ ఎక్కేందుకు భారీ మొత్తం చెల్లించి ..తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని వేగంగా సురక్షితంగా చేరాలని ప్రతి ఒక్క ప్రయాణీకుడు భావిస్తారు. అయితే విమానం ఎక్కి కొన్ని గంటలపాటు ప్రయాణించిన తర్వాత తీరా తిరిగి తాము ప్లైట్ ఎక్కిన చోటే దిగితే ఎలా ఉంటుంది ఇటువంటి అనుభవాన్ని శుక్రవారం డెల్టా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A350లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ఎదుర్కొన్నారు. బార్సిలోనాకు వెళ్లే విమానం జార్జియాలోని అట్లాంటా నుండి బయలుదేరింది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు తీవ్రమైన విరేచనాలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కేవలం 2 గంటలపాటు ప్రయాణించిన విమానం తర్వాత తిరిగి అట్లాంటాకు చేరుకుంది.
ఫ్లైట్‌రాడార్ 24 నివేదిక ప్రకారం ఎయిర్‌బస్ A350ను జార్జియాలోని అట్లాంటా నుండి బార్సిలోనా, స్పెయిన్ వెళ్లే విధంగా షెడ్యూల్ చేశారు. ఈ విమానం ప్రయాణం మొత్తం ఎనిమిది గంటలు సాగనుంది. ఈ ప్రయాణంలో సుమారు 2 గంటలు సాగింది.
ఫ్లైట్ డెక్ నుండి ఆడియో ట్రాన్స్‌మిషన్ వాస్తవానికి Redditలో xStang05x పోస్ట్ చేశారు. తరువాత X ద్వారా Thenewarea51 షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ని చెప్పడం వినవచ్చు, ”ఇది బయోహాజార్డ్ సమస్య అని .. తాము విమానంలో విరేచనాలతో బాధపడుతున్న ఒక ప్రయాణికుడి గురించి తెలుసుకున్నామని కనుక మేము మా విమానాన్నితిరిగి అట్లాంటాకు తీసుకుని రావాలని కోరుతున్నట్లు చెప్పారు. తాము ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నామనే సందేహంతో ఇతర ప్రయాణీకులు ప్లైట్ సిబ్బందిని ప్రశ్నించారు.
A Delta Airlines Airbus A350 turned around back to Atlanta Friday night because of diarrhea throughout the airplane from a passenger and it’s a biohazard. 👀🥴
The FAA flight strip for DL194 was posted to Reddit (📷xStang05x) Also a passenger posted here asking why her son’s… pic.twitter.com/VWbkB47wF1
— Thenewarea51 (@thenewarea51) September 3, 2023
అప్పుడు డెల్టా అధికారులు ఒక మెడికల్ సమస్య” ఏర్పడిందని.. అందుకనే విమానం అత్యవసర ల్యాండింగ్ ను తీసుకున్నామని చెప్పారు. దీంతో ప్లైట్ ల్యాండింగ్ కు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా చేశారు. అయితే ఆ ప్రయాణీకుడికి సంబంధించిన ఎటువంటి సమాచారం ఎవరూ వెల్లడించలేదు.
ఈ సంఘటనకు కారణమైన ప్రయాణీకుడి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియదు. అయితే ప్లైట్ లో ఉన్న ఇతర ప్రయాణికులను, సిబ్బందికి ప్రత్యామ్నాయ విమానానికి బదిలీ చేశారు. అట్లాంటాకు తిరిగి వచ్చిన తర్వాత విమానాన్ని శుభ్రపరిచారు. అనంతరం బార్సిలోనాకు వెళ్లే ప్రయాణికులకు ఇదే విమానంలో తీసుకుని వెళ్లారు. ఫ్లైట్‌రాడార్ 24 నివేదిక ప్రకారం.. ఊహించని జాప్యం కారణంగా విమానం వాస్తవానికి షెడ్యూల్ చేసిన దానికంటే 8 గంటలు ఆలస్యంగా బయలుదేరి.. చివరకు స్పెయిన్‌లో ల్యాండ్ అయింది. అయితే ఇతర ప్రయాణీకుల్లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్య ఉన్న ప్రయాణీకుడు తమతో ప్రయాణించాడా లేదా అన్న విషయం తెలియలేదు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..