AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఘాటు మిర్చిని ముక్కుకు రుద్దుకున్న యువతి.. అలెర్జీతో 6 నెలలుగా ఆస్పత్రిలోనే.. ఎప్పటికి డిశార్జ్ అవుతుందో చెప్పలేమంటున్న వైద్యులు..

25 ఏళ్ల థాయిస్ మెదీరోస్ డి ఒలివెరా అనే యువతి ఫిబ్రవరి సాయంత్రం తన ప్రియుడితో కలిసి  తల్లిదండ్రుల కోసం డిన్నర్ రెడీ చేస్తోంది. ఈ సమయంలో ఆమె తనకు తెలియకుండానే ముక్కుపై ఈ గోట్ పెప్పర్ ను రుద్దుకుంది. దీంతో ఆ యువతి జీవితం మారిపోయింది. ఘాటైన మిర్చి ఆమె మెదడుపై తీవ్ర ప్రభావం చూపించింది. మెదడుని ఉబ్బిపోయేలా చేసింది.. అంతేకాదు ఈ మిర్చి దుష్ప్రభావంతో మాట పడిపోయింది.

Viral News: ఘాటు మిర్చిని ముక్కుకు రుద్దుకున్న యువతి.. అలెర్జీతో 6 నెలలుగా ఆస్పత్రిలోనే.. ఎప్పటికి డిశార్జ్ అవుతుందో చెప్పలేమంటున్న వైద్యులు..
Red Snot Chilli Pepper
Surya Kala
|

Updated on: Sep 05, 2023 | 8:39 PM

Share

ఎక్కువ కారం తింటే ఎవరికైనా కళ్ల నుంచి నోటి నుంచి నీరు కారడం సర్వసాధారణం.. అయితే కారం తినడం వలన నెలల తరబడి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటారని ఎవరైనా ఊహించారా..? ఇలాంటి వింత ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన 25 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి డిన్నర్ సిద్ధం చేస్తున్నప్పుడు సూపర్ స్పైసీ గోట్ పెప్పర్‌ వలన గత ఆరు నెలలుగా ఆసుపత్రిలో ఉంది. ఇప్పుడు మెదడు వాపు బారిన పడి చికిత్స తీసుకుంటుంది.

25 ఏళ్ల థాయిస్ మెదీరోస్ డి ఒలివెరా అనే యువతి ఫిబ్రవరి సాయంత్రం తన ప్రియుడితో కలిసి  తల్లిదండ్రుల కోసం డిన్నర్ రెడీ చేస్తోంది. ఈ సమయంలో ఆమె తనకు తెలియకుండానే ముక్కుపై ఈ గోట్ పెప్పర్ ను రుద్దుకుంది. దీంతో ఆ యువతి జీవితం మారిపోయింది. ఘాటైన మిర్చి ఆమె మెదడుపై తీవ్ర ప్రభావం చూపించింది. మెదడుని ఉబ్బిపోయేలా చేసింది.. అంతేకాదు ఈ మిర్చి దుష్ప్రభావంతో మాట పడిపోయింది. నడిచే సామర్థ్యాన్ని కోల్పోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలో 6 నెలలు చికిత్స తీసుకుంది.

థాయిస్ మెదీరోస్ డి ఒలివెరా ఈ ఘాటు మిర్చి వాసన చూసిన తర్వాత గొంతులో దురద, చిరాకుతో ఇబ్బంది పడడం మొదలైంది. ఈ లక్షణాలు క్షణ క్షణానికి తీవ్రమైపోవడంతో వెంటనే ఆమెను అనాపోలిస్ స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఆమె స్వస్థలమైన గోయానియాలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలో ఈ మిర్చి వలన అలెర్జీ బారిన పడినట్లు గుర్తించారు. అంతేకాదు ఆమె మెదడు వాపుతో బాధపడుతున్నట్లు తేలింది. పరిస్థితి క్రమంగా క్షీణించి చాలా రోజులు కోమాలో ఉండిపోయింది. నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె జులై 31న డిశ్చార్జి అయింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలో ఘాటైన మిర్చిలో ఒకటి ఈ స్పైసీ గోట్ మిర్చి.. దీనిలో స్కోవిల్లే స్కేల్‌లో 15000 నుంచి  30000 మధ్య ఉంటాయి. స్కోవిల్లే స్కేల్‌ను మిరపకాయల కారంగా లేదా వేడిని స్కోవిల్లే హీట్ యూనిట్లలో కొలుస్తారు.

థాయిస్ మొదట జూలై 31న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. అనంతరం ఆమె తీవ్ర జ్వరంతో బాధపడడమే కాదు.. ఎరుపు రంగులో మూత్రం రావడంతో 4 రోజుల తర్వాత ఆమెను మళ్లీ ఆస్పత్రిలో జాయిన్ చేర్చారు. తిరిగి ఆమెను ఆగస్టు 10న డిశార్జ్ చేయాల్సి ఉంది. అయితే ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో చికిత్సను కొనసాగిస్తున్నారు. ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలు బిగుసుకుపోయాయి.  దీంతో థాయిస్ ఇప్పటికీ ఆసుపత్రిలో ఉంది. ఆమె పరిస్థితి దారుణంగా ఉండడంతో థాయిస్ ను డాక్టర్లు ఆమెను ఎప్పటికి డిశార్జ్ చేస్తారో చెప్పలేమని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..