Most Expensive Number Plate: ఇదే అత్యంత ఖరీదైన కారు నెంబర్‌ ప్లేట్‌.. వేలంలో ఏకంగా రూ.8 కోట్ల 62 లక్షలకు విక్రయం

ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్‌ లక్షల రూపాయలు వెచ్చించి మరీ కొందరు కారు యజమానులు కొంటుంటారు. అభిరుచి వల్లనైతేనేమి, అదృష్టం వరిస్తుందనే ఆశతోనైతేనేమి ఎగబడి మరీ ఫ్యాన్సీ నెంబర్‌ ప్లేట్లను కొనుగోలు చేస్తుంటారు. ఇక ఇలాంటి ఫ్యాన్సీ వెహికల్ లైసెన్స్ ప్లేట్ల అమ్మకాలకు వేలం పాటలు నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ వేలంపాటలో అధికమొత్తంలో పాట పాడిన వారు కారు నెంబర్ ప్లేట్‌ను వరిస్తారు. తాజాగా ఇలాంటి..

Most Expensive Number Plate: ఇదే అత్యంత ఖరీదైన కారు నెంబర్‌ ప్లేట్‌.. వేలంలో ఏకంగా రూ.8 కోట్ల 62 లక్షలకు విక్రయం
Most Expensive Car Number Plate
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 05, 2023 | 9:22 PM

అబుదాబి, సెప్టెంబర్‌ 5: ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్‌ లక్షల రూపాయలు వెచ్చించి మరీ కొందరు కారు యజమానులు కొంటుంటారు. అభిరుచి వల్లనైతేనేమి, అదృష్టం వరిస్తుందనే ఆశతోనైతేనేమి ఎగబడి మరీ ఫ్యాన్సీ నెంబర్‌ ప్లేట్లను కొనుగోలు చేస్తుంటారు. ఇక ఇలాంటి ఫ్యాన్సీ వెహికల్ లైసెన్స్ ప్లేట్ల అమ్మకాలకు వేలం పాటలు నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ వేలంపాటలో అధికమొత్తంలో పాట పాడిన వారు కారు నెంబర్ ప్లేట్‌ను వరిస్తారు. తాజాగా ఇలాంటి వేలంపాట ఒకటి దుబాయ్‌లో జరిగింది. లక్షలు కాదు ఏకంగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేశాడో వ్యక్తి. దీంతో ఈ వార్త కాస్తా ప్రస్తుతం సర్వత్రా చర్చణీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే..

దుబాయ్‌లో సోమవారం (సెప్టెంబర్‌ 2) ఫ్యాన్సీ వెహికల్ లైసెన్స్ ప్లేట్ వేలం జరిగింది. ఈ వేలంలో ఓ ఫ్యాన్సీ వెహికల్ లైసెన్స్ ప్లేట్ నంబర్ దాదాపు 3.82 మిలియన్‌ దిర్హామ్‌లు ధర పలికింది. భారతీయ కరెన్సీలో రూ. 8,62,98,375. ఇంటర్‌ కాంటినెంటల్ దుబాయ్ ఫెస్టివల్ సిటీ హోటల్‌లో జరిగిన 113వ బహిరంగ వేలంలో ‘AA 70’ రిజిస్ట్రేషన్ నెంబర్‌ అత్యంత అధిక ధరకు అమ్ముడుపోయింది. ఇదే అత్యంత ఖరీదైన నెంబర్‌ ప్లేట్‌ అని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ హోటల్‌ జరిపిన వేలం సమయంలో మొత్తం 90 నంబర్ ప్లేట్లు అమ్మకానికి వచ్చాయి. వీటిని విక్రయించగా మొత్తం 49.789 మిలియన్‌ దిర్హామ్‌లు ఆదాయం గడించారు. భారతీయ కరెన్సీలో రూ. 1,12,50,05,560 (112 కోట్లు) ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బహిరంగ వేలంతో పోలిస్తే ఈ మొత్తం 30 శాతం అధిక ఆదాయం వచ్చింది. నాటి వేలంలో 38.21 మిలియన్ దిర్హామ్‌లకు కారు నెంబర్ ప్లేట్‌లను విక్రయించారు. మన కరెన్సీలో 86,33,15,771 కోట్ల రూపాయలన్న మాట.

కాగా అరుదైన లైసెన్స్ ప్లేట్లు, ఫోన్ నంబర్‌లు UAEలో భారీ మొత్తాలకు అమ్ముడవడం అక్కడ సాధారణ విషయం అయినప్పటికీ అన్ని కోట్లు పెట్టి వాటిని కొంటారనే విషయం మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. దుబాయ్‌లో ఇలాంటి వేలంలు ఏదైనా ముఖ్య కారణం కోసం నిధుల సమీకరణకు వీటిని నిర్వహిస్తుంటారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.