Hyderabad: వీళ్లెక్కడి దొంగలండీ బాబూ.. అరెస్టు చేసి లాకప్‌లో వేస్తే ఏకంగా పోలీస్ స్టేషన్‌కే కన్నం
హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓకేసు నిమిత్తం నిందితులను అరెస్టు చేసి లాకప్ లో పెడితే ఎలాంటి చీకుచింత భయం లేకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ కే కన్నం వేశారు నిందితులు. పోలీస్ స్టేషన్లోనే దర్జాగా లాకప్ ఓపెన్ చేసుకొని మూడు సెల్ఫోన్లను చోరీ చేశారు నిందితులు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు లోతుగా దర్యాప్తు ..
హైదరాబాద్, సెప్టెంబర్ 5: హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓకేసు నిమిత్తం నిందితులను అరెస్టు చేసి లాకప్ లో పెడితే ఎలాంటి చీకుచింత భయం లేకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ కే కన్నం వేశారు నిందితులు. పోలీస్ స్టేషన్లోనే దర్జాగా లాకప్ ఓపెన్ చేసుకొని మూడు సెల్ఫోన్లను చోరీ చేశారు నిందితులు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 30వ తేదీన ఈ ఘటన రెండు గ్రూపుల మధ్య గొడవ నేపథ్యంలో పెట్రోలింగ్ సిబ్బంది ముగ్గురు యువకులను చిలకలగూడ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సాయి రాజ్, వినయ్ తో పాటు మరో యువకుడిని చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఉంచారు. . చిన్న గొడవ కావడంతో వీరిపై పిట్టి కేస్ నమోదు చేశారు చిలకలగూడ పోలీసులు.. దీంతో ఈ ముగ్గురి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోర్టులో ఫైన్ కట్టిన తర్వాత తమ ఫోన్లను ఇస్తామని పోలీసులు చెప్పటంతో యువకులు పోలీస్ స్టేషన్ నుండి వెళ్లిపోయారు.
నిందితుడు కాజేసిన వీడియో ను చూపించిన కానిస్టేబుల్
అ మరుసటి రోజు కోర్ట్ లో ఫైన్ కట్టిన యువకులు తమ ఫోన్లను తీసుకునేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అప్పటికే యువకుల ఫోన్లు కనిపించకపోవడంతో మూడు రోజులపాటు యువకులను పోలీస్ స్టేషన్ కు తిప్పించుకున్నారు పోలీసులు.. మూడు రోజులు గడిచిన పోలీసులు తమ ఫోన్లు ఇవ్వకపోవడంతో మీడియాను ఆశ్రయించాడు బాధితుడు. యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఆగస్టు 30వ తేదీన తమ ఫోన్లను ఒక నిందితుడు చోరీ చేసినట్టు బాధితుడు తెలిపాడు.. చిలకలగూడ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ సంజయ్ తమకు ఒక వీడియో చూపించినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఆ వీడియోలో లాక్ అప్ లో ఉన్న నిందితుడు బయటికి వచ్చి 3 ఫోన్లను తీసుకొని కిటికీలో నుండి బయటపడేసి, ఆ తర్వాత తాను బయటికి వెళ్లి ఆ మూడు ఫోన్లను తీసుకొని ఆ నిందితుడు పారిపోయినట్ట కానిస్టేబుల్ సంజయ్ తమకు చెప్పినట్టు బాధితుడు తెలిపాడు. ఈ తతంగమంతా నడుస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్లో ఎవరూ లేరని బాధితుడు చెబుతున్నాడు.. తనకు ఎలాగైనా సరే కొత్త ఫోన్ కొనిస్తానని ఈ విషయం బయటకి చెప్పొద్దంటూ కానిస్టేబుల్ సంజయ్ తమకు చెప్పినట్టు బాధితుడు ఆరోపిస్తున్నాడు.
ఘటన పై విచారణ జరుపుతాం – పోలీసులు
అయితే ఫోన్లు చోరీ వ్యవహారం తనకి తెలీదు అంటున్నారు చిలకలగూడ పోలీసులు. ఫోన్ పోయినట్టు బాధితులు ఎక్కడ తమను సంప్రదించలేదని చిలకలగూడ పోలీసులు చెబుతున్నారు. బాధితుడు మాట్లాడిన వీడియో చూసిన తర్వాత ఈ ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.