అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ రోజు కోస్తా రాయలసీమలో మోస్తరు నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.