- Telugu News Photo Gallery Cinema photos Heroine kiara advani saying about success in film industry Telugu Actress Photos
Kiara Advani: సక్సెస్ గురించి మాట్లాడిన కియారా.. ఏం చెప్పారంటే..
ఇన్నాళ్లు ఓ రకంగా సాగితే ఇప్పుడు లైఫ్ ఇంకో రకంగా ఉందా.! అని కియారాని చాలామంది అడుగుతున్నారు అట. అలా ఉండదు.. ఇన్‌ఫ్యాక్ట్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్తున్నారు మేడం కియారా. అప్పుడు , ఇప్పుడు, ఎప్పుడూ ప్రొఫెషనల్ గా ఉండటానికి ట్రై చేస్తా అన్నారు. మనసుకి నచ్చితే కానీ సినిమాకు సైన్ చెయ్యను అని చెప్పారు.
Anil kumar poka | Edited By: Ravi Kiran
Updated on: Sep 05, 2023 | 7:38 PM

అనుకున్న రేంజ్ కు చేరుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. నిరంతరం కృషి , ఏదో ఒకటి నేర్చుకోవడం.. నిద్ర లేని రాత్రులు , శ్రమ , అవమానాలు ఇలా ఎన్నెన్నో కలిస్తే కానీ సక్సెస్ అనే పదానికి సమానం కాదు.. అయితే ఒక్కసారి హైట్స్ రీచ్ అయ్యాక కూడా అంతే కష్టపడాల్సి వస్తుందా.. ఈ టాపిక్ గురించి స్పెషల్ గా మెంక్షన్ చేస్తున్నారు బాలీవుడ్ క్వీన్ కియారా.

పుట్టి, పెరిగింది అక్కడే అయినా, ఎక్కువ సినిమాలు చేస్తుంది అక్కడే అయినా.. మనకి కియారా ఎప్పుడు నార్త్ లేడీలా కనిపించదు.. తెలుగమ్మాయి అనే ఫీలింగ్ లోనే ఉంటాం. అందుకే ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ అయినా హీరోయిన్స్ లిస్ట్ లో కియారా పేరు తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది.

ఇన్నాళ్లు ఓ రకంగా సాగితే ఇప్పుడు లైఫ్ ఇంకో రకంగా ఉందా.! అని కియారాని చాలామంది అడుగుతున్నారు అట. అలా ఉండదు.. ఇన్‌ఫ్యాక్ట్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్తున్నారు మేడం కియారా.

అప్పుడు , ఇప్పుడు, ఎప్పుడూ ప్రొఫెషనల్ గా ఉండటానికి ట్రై చేస్తా అన్నారు. మనసుకి నచ్చితే కానీ సినిమాకు సైన్ చెయ్యను అని చెప్పారు. డబ్బులు కోసం తాను ఎప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోలేదని చెప్పారు. ప్రాజెక్ట్స్ ఎక్సయిటింగ్ అనిపిస్తేనే ఒప్పుకుంటా అని చెప్పారు కియారా.

ఎంతో కష్టపడి చేసిన సినిమాలు కొన్ని సార్లు ఆడవు. అలా అని ఆగిపోకూడదు.. జడ్జిమెంట్ మీద అనుమానాలు పెట్టుకోకూడదు. మళ్ళీ మనసుకు నచ్చిన కథలే చెయ్యాలి. ఎందుకంటే థియేటర్ లో కూర్చొని చూసేది కూడ తనలాంటి సిని లవర్స్ నే కదా అంటున్నారు కియారా. ప్రస్తుతం టాలీవుడ్ లో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ లో నటిస్తుంది ఈ బ్యూటీ కియారా.





























