రెస్టారెంట్‌ నుంచి తెచ్చుకున్న పుట్టగొడుగుల సూప్‌.. తింటుండగా కనిపించిన వింత ఆకారం.. ఏంటా అని చూడగా..

రెస్టారెంట్‌లో ఆర్డర్‌ చేసిన వంటకాన్ని ఇంటికి తీసుకెళ్లాడో వ్యక్తి, తిందామని ప్లేట్‌లో వడ్డించుకోగా సూప్‌లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. తరచి చూడగా ముందుగా తోక కనిపించింది. ఆ తర్వాత కనిపించింది చూసి దాదాపు గుండె ఆగినంత పనైంది. వేడివేడి సూప్‌లో ఊహించని రీతిలో కనిపించిన దానిని చూసి..

రెస్టారెంట్‌ నుంచి తెచ్చుకున్న పుట్టగొడుగుల సూప్‌.. తింటుండగా కనిపించిన వింత ఆకారం.. ఏంటా అని చూడగా..
Mouse In Soup
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 05, 2023 | 8:20 PM

రెస్టారెంట్‌లో ఆర్డర్‌ చేసిన వంటకాన్ని ఇంటికి తీసుకెళ్లాడో వ్యక్తి, తిందామని ప్లేట్‌లో వడ్డించుకోగా సూప్‌లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. తరచి చూడగా ముందుగా తోక కనిపించింది. ఆ తర్వాత కనిపించింది చూసి దాదాపు గుండె ఆగినంత పనైంది. వేడివేడి సూప్‌లో ఊహించని రీతిలో కనిపించిన దానిని చూసి గుడ్లు తేలేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే..

యూకేలోని కెంట్‌కు చెందిన సామ్ హేవార్డ్ అనే వ్యక్తి చైనీస్ టేక్‌అవే రెస్టారెంట్‌కు వెళ్లి పుట్టగొడుగుల (మష్రూమ్‌) సూప్‌ ఆర్డర్‌ చేశాడు. అనంతరం పార్సిల్‌ తీసుకుని తన ఫ్రెండ్‌ ఇంటికి దానిని తీసుకుని వెళ్లాడు. రాత్రి భోజనం చెద్దామని ఫ్రెండ్‌తోపాటు కూర్చున్నాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారు. ఇంతలో సామ్ హేవార్డ్ తన ముందు గిన్నెలో ఉన్న సూపులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఎంటా అని చూస్తున్న హేవార్డ్‌కు ఓ తోక కనిపించింది. దానిని చూసిన అతను సూప్‌లో రెస్టారెంట్‌ చెఫ్‌ పెద్ద పుట్టగొడుగు వేసినట్లు ఉన్నాడని భావించాడు. కాసేపటికే దానిలో నుంచి చిట్టెలుక పైకి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన హేవార్డ్ వెంటనే తన ఫోన్‌ నుంచి సూప్‌లో కదులుతోన్న ఎలుకకు సంబంధించిన వీడియోను తీసి టేక్‌అవే ఆర్డర్ చేసిన రెస్టారెంట్‌కు ఫోన్‌ కొట్టాడు.

‘నేను భోజనం తినడం ప్రారంభించాను. దానిలో మూడు వంతుల భోజనం అప్పటికే తినేశాం. ఇంతలో సూప్‌లో పెద్ద పుట్టగొడుగు లాంటి ఆకారం కనిపించింది. అది అవునా.. కాదా? అనే సందేహంతో పరిశీలించి చూడగా ప్రాణాలతో ఉన్న ఓ జీవిగా గుర్తించాను. దీంతో నాకు చాలా భయం వేసింది. రెస్టారెంట్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేయగా తమకు ఎటువంటి బాధ్యత లేదని, వాపసు తీసుకోవడానికి నిరాకరించింది. హేవార్డ్ దానిని కొనుగోలు చేసినప్పుడు నగదు రూపంలో రెస్టారెంట్‌ బిల్లు చెల్లించలేదు. దీంతో ఎలాంటి రసీదు లేకపోవడంతో ఆ రెస్టారెంట్‌లోనే సూప్‌ కొనుగోలు చేశామనే విషయాన్ని రుజువు చేయలేకపోయామని వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా హేవార్డ్ సదరు రెస్టారెంట్‌కు రెండు దశాబ్దాలుగా నమ్మకమైన కస్టమర్‌. కానీ ఈ ఘటనపై రెస్టారెంట్‌ ప్రతిస్పందన తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను కోరుకున్నదల్లా వారు క్షమాపణలు చెప్పాలని మాత్రమే. అది కేవలం ఓ ప్రిన్సిపల్‌ మాత్రమేనని తన అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకున్నాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?