AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: చైనాలో ఏం జరుగుతోంది.. రక్షణ మంత్రి అదృశ్యం.. అనేక మంది ఉన్నతాధికారులు అరెస్ట్ ..

చైనా వీవీఐపీలు కనిపించకుండా పోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో చైనా విదేశాంగ మంత్రి కూడా హఠాత్తుగా అదృశ్యమయ్యారు. జిన్‌పింగ్‌ను అర్థం చేసుకున్న వారు ఈ ఘటనల వెనుక జిన్‌పింగ్‌ హస్తం ఉందని చెబుతున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తనకు సన్నిహితంగా ఉన్నవారిని కూడా తన దారి నుండి తప్పిస్తూ అపఖ్యాతి పాలయ్యారు. ఈ చైనా నియంత భవిష్యత్తులో తన ప్రభుత్వానికి ముప్పుగా మారగలరని భావిస్తే.. వారు తన సన్నిహితులైనా సరే వారిని ప్రపంచం దృష్టి నుంచి తప్పిస్తూ దాచి పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

China: చైనాలో ఏం జరుగుతోంది.. రక్షణ మంత్రి  అదృశ్యం.. అనేక మంది ఉన్నతాధికారులు అరెస్ట్ ..
China System Shaken
Surya Kala
|

Updated on: Sep 12, 2023 | 3:29 PM

Share

భారత్ పొరుగు దేశమైన చైనా తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి లీ షాంగ్ ఫూ అదృశ్యం తర్వాత జిన్‌పింగ్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. లీ షాంగ్ ఫూ అదృశ్యమైన వెంటనే, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులను భారీ ఎత్తున అరెస్టు చేశారు. జిన్‌పింగ్‌ను నిలదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందుకే ప్రత్యర్థులను అణచివేయాలనే ప్లాన్ తో జిన్‌పింగ్ చేస్తున్న పని ఇదే అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం అరెస్ట్ చేసిన వారిలో రక్షణ శాఖల అధిపతులు కూడా ఉన్నట్లు సమాచారం. క్రమశిక్షణారాహిత్యం పేరుతో ఈ అరెస్టులు జరిగాయి.

ఏ వ్యక్తులను అరెస్టు చేశారంటే?

యువాన్ జీ, చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్

చెన్ గుయోయింగ్, చైనా నార్త్ ఇండస్ట్రీ గ్రూప్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్

ఇవి కూడా చదవండి

టాన్ రుయిసాంగ్, చైనా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ లను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ తన సన్నిహితులను తన దారిలో నుంచి తప్పించి అపఖ్యాతి పాలయ్యారు.

చైనా వీవీఐపీలు కనిపించకుండా పోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో చైనా విదేశాంగ మంత్రి కూడా హఠాత్తుగా అదృశ్యమయ్యారు. జిన్‌పింగ్‌ను అర్థం చేసుకున్న వారు ఈ ఘటనల వెనుక జిన్‌పింగ్‌ హస్తం ఉందని చెబుతున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తనకు సన్నిహితంగా ఉన్నవారిని కూడా తన దారి నుండి తప్పిస్తూ అపఖ్యాతి పాలయ్యారు. ఈ చైనా నియంత భవిష్యత్తులో తన ప్రభుత్వానికి ముప్పుగా మారగలరని భావిస్తే.. వారు తన సన్నిహితులైనా సరే వారిని ప్రపంచం దృష్టి నుంచి తప్పిస్తూ దాచి పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

లి షాంగ్ ఫూపై అవినీతి ఆరోపణలు

లి షాంగ్ ఫూ చివరిగా ఆగస్ట్ 29న కనిపించారు. బీజింగ్‌లోని చైనా-ఆఫ్రికా ఫోరమ్ వేదికపై ఆయన  ప్రసంగించారు. ఆగస్ట్ 29 సాయంత్రం నుండి లి షాంగ్ ఫూ గురించి ఎటువంటి సమాచారం లేదు. లీ షాంగ్ ఫూపై అవినీతి ఆరోపణలు వచ్చాయనే వార్తలు కూడా వినిపించాయి. రక్షణ మంత్రి కాకముందు, లి షాంగ్  మిలిటరీ ఎక్విప్‌మెంట్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రిగా ఉన్నారు. రక్షణ మంత్రి అయ్యాక శాఖాపరమైన విచారణ మొదలైంది. విచారణలో లీ షాంగ్ ఫూ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం చైనా రక్షణ మంత్రిని తప్పించినట్లు ఇప్పుడు భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..