Viral: వీడు మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన దొంగ.. వైరల్ వీడియో.

Viral: వీడు మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన దొంగ.. వైరల్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 13, 2023 | 5:35 PM

ఇటీవల దొంగలు చిత్ర విచిత్రంగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఇక్కడ ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే కొట్టేసాడు. అదికూడా బస్సులో ప్రయాణికులు ఉండగానే. అవును ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట బస్ స్టాండ్ లో ప్రయాణికులందరూ బస్సులో ఉండగానే బస్సును ఎత్తుకెళ్లి.. బస్సు డ్రైవర్, కండక్టర్ కు షాకిచ్చాడు ఓ దొంగ.

ఇటీవల దొంగలు చిత్ర విచిత్రంగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఇక్కడ ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే కొట్టేసాడు. అదికూడా బస్సులో ప్రయాణికులు ఉండగానే. అవును ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట బస్ స్టాండ్ లో ప్రయాణికులందరూ బస్సులో ఉండగానే బస్సును ఎత్తుకెళ్లి.. బస్సు డ్రైవర్, కండక్టర్ కు షాకిచ్చాడు ఓ దొంగ. బస్సును తీసుకొని వేములవాడకు వెళ్లాడు. అక్కడ బస్టాండ్‌లోని హైదరాబాద్‌ పాయింట్‌లో బస్సును నిలిపి బస్సు హైదరాబాద్‌కు వెళ్తుందని చెప్పి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. కొంత దూరం వచ్చాక టికెట్‌ ఇవ్వమని బస్సు డ్రైవర్‌ని అడిగారు ప్యాసింజర్లు. అందుకు కండక్టర్‌ మార్గమధ్యలో బస్సు ఎక్కుతాడు.. అప్పుడు టికెట్‌ తీసుకోమని చెప్పాడు. ఇంతలో తంగళ్లపల్లి మండలం సారంపెల్లి – నేరెళ్ల గ్రామ శివారుకు చేరుకునే సరికి బస్సులో డీజిల్ అయిపోవడంతో బస్సు ఆగిపోయింది.

ఆ దొంగ బస్సును అక్కడే ఆపేసి, ప్రయాణికులను దింపేసాడు. బస్ లో డీజిల్ అయిపోయిందని ప్రయాణికులను వేరే బస్ ఎక్కి వెళ్లమని చెప్పాడు. అనుమానం వచ్చిన ప్రయాణికులు ఆ దొంగను నిలదీయడంతో వారికి విషయం అర్ధమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సు ఆగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే బస్సును ఎత్తుకెళ్లిన దొంగ అక్కడ్నుంచి జారుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొందరు ప్రయాణికులు ఆ బస్సు దొంగను వీడియో తీశారు. వాటి ఆధారంగా నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు, బస్సు బస్టాండ్‌లో కనిపించకపోవడంతో ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు విషయం తెలిసి కొంత ఊరట చెందారు. అయితే, దొంగ ఎత్తుకెళ్లిన బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..