Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కడప మీదుగా వెళ్లే జల్నా- తిరుపతి స్పెషల్ ట్రైన్ నాలుగు రోజుల పాటు రద్దు

దేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్దానానికి భక్తులు లక్షలాదిగా వస్తుంటారు. అందులో భాగంగా రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్ళను తిరుపతికి నడుపుతుంది . ఈ క్రమంలోనే జల్నా-తిరుపతికి వయా కడప మీదుగా ప్రత్యేక రైలు తిప్పుతున్న రైల్వే శాఖ ఈనెల, వచ్చే నెలలో దాదాపు నాలుగు రోజులపాటు రైలును రద్దు చేస్తున్నట్లు కడప రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కడప మీదుగా వెళ్లే జల్నా- తిరుపతి స్పెషల్ ట్రైన్ నాలుగు రోజుల పాటు రద్దు
Jalna Tirupati Special Train
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Sep 12, 2023 | 3:00 PM

కడప, సెప్టెంబర్‌ 12: దేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్దానానికి భక్తులు లక్షలాదిగా వస్తుంటారు. అందులో భాగంగా రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్ళను తిరుపతికి నడుపుతుంది . ఈ క్రమంలోనే జల్నా-తిరుపతికి వయా కడప మీదుగా ప్రత్యేక రైలు తిప్పుతున్న రైల్వే శాఖ ఈనెల, వచ్చే నెలలో దాదాపు నాలుగు రోజులపాటు రైలును రద్దు చేస్తున్నట్లు కడప రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు.

తిరుపతి వెళ్లాలన్న రావాలన్నా కడప మీదుగా రైళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలావరకు రైళ్లన్నీ కడప మీదుగానే క్రాస్ అవుతూ ఉంటాయి. అయితే రైల్వే శాఖ అభివృద్ధి పనులలో భాగంగా కొన్ని రైల్వే స్టేషన్లలో మూడవ ట్రాక్ నిర్మాణ పనులు నిర్వహిస్తూ ఉంది దానికి సంబంధించి పనులు జరుగుతున్న సమయంలో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అటువైపు వచ్చే కొన్ని రైళ్లను రద్దు చేసింది . ఈ క్రమంలో జాల్నా మరియు తిరుపతికి వెళ్లే రైలును ఈ నెల 19, 26 మరియు వచ్చేనెల 3, 10 తారీకులలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ ట్రైన్ తిరుపతిలో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరితే కడప మీదుగా కర్నూలు డోన్ టచ్ చేస్తూ జల్నాకు వెళ్లడానికి రెండు రోజుల సమయం పడుతుంది.

అంటే తిరుపతి నుంచి జల్నా వెళ్లడానికి ఒకటిన్నర రోజు పడుతుంది కాబట్టి చాలామంది ప్రయాణికులు ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న నేపథ్యంలో రైలును రద్దు చేశారు కాబట్టి ప్రయాణికులు దీనిని గమనించి వారు ఈ ట్రైన్ కు రిజర్వేషన్ చేయించుకోవద్దని రైల్వే శాఖ ముందస్తుగా ప్రకటించింది . ఈ ట్రైన్ చాలా సుదూర ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలు రద్దు విషయాన్ని కడప జిల్లా రైల్వే శాఖకు సంబంధించిన రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ సమాచారం ఇచ్చారు. ట్రైన్ నెంబర్ 07413 మరియు రిటర్న్ ట్రైన్ నెంబర్ 07414 ఈ ట్రైన్ కు సంబంధించి ఎటువంటి రిజర్వేషన్లు చేయబడటం లేదని ఎవరూ కూడా రిజర్వేషన్ చేసుకోవద్దని ఈ ట్రైన్ రద్దు అయిందని రైల్వే శాఖ అధికారి వివరించారు.

ఇవి కూడా చదవండి

ఒకవేళ ఈ ట్రైన్ కు ముందస్తు రిజర్వేషన్లు జరిగి ఉండి ఉంటే ఎవరైతే రిజర్వేషన్ చేసుకున్నారు వారికి నగదు చెల్లింపులపై క్లారిటీ ఇవ్వలేదు ఒకవేళ నగదు తిరిగి చెల్లిస్తారా లేదా మరో రోజు రిజర్వేషన్ చేసుకునే దానికి అవకాశం ఇస్తారా అనేది ప్రయాణికులు రైల్వే శాఖ వద్ద క్లారిటీ తీసుకోవలసి ఉంది .

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.