Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: ఇప్పుడు వేలి ముద్రలు దొంగిలిస్తోన్న సైబర్ నేరగాళ్లు.. క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ! జరభద్రం..

నానాటికీ సైబర్ మోసాలకు కేటుగాళ్లు కొత్త మార్గాలు సృష్టిస్తూనే ఉన్నారు. సాధారణంగా మొబైల్ ఫోన్‌లో వచ్చే OTPని ఎవరైనా అపరిచితులతో పంచుకుంటే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే సందర్భాలు ఇప్పటి వరకూ చాలానే చూశాం. ఐతే ఓటీపీ లేకుండా కేవలం వేలిముద్ర సహాయంతో ఆధార్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఓ మహిళ బ్యాంకు..

Cyber Crime: ఇప్పుడు వేలి ముద్రలు దొంగిలిస్తోన్న సైబర్ నేరగాళ్లు.. క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ! జరభద్రం..
Cyber Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 12, 2023 | 9:03 AM

బెంగళూరు, సెప్టెంబర్‌ 12: నానాటికీ సైబర్ మోసాలకు కేటుగాళ్లు కొత్త మార్గాలు సృష్టిస్తూనే ఉన్నారు. సాధారణంగా మొబైల్ ఫోన్‌లో వచ్చే OTPని ఎవరైనా అపరిచితులతో పంచుకుంటే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే సందర్భాలు ఇప్పటి వరకూ చాలానే చూశాం. ఐతే ఓటీపీ లేకుండా కేవలం వేలిముద్ర సహాయంతో ఆధార్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును దొంగిలించారు. ఈ సంచలన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కర్నాటకలో ఈ తరహా మోసం తొలిసారి వెలుగు చూసింది. మోసపోయిన మహిళ బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయమైన విషయాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరులోని వసంతనగర్‌లో నివాసముంటున్న 57 ఏళ్ల మహిళకు సెప్టెంబర్ 7న ఉదయం తన బ్యాంకు ఖాతా నుంచి రూ.10,000 క్యాష్ విత్‌డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. తాను ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండానే డబ్బు పోవడం గమనించి వెంటనే తన ఖాతాను తనిఖీ చేసుకుంది. రెండు రోజుల క్రితం మరో పది వేల రూపాయలు కూడా బదిలీ అయినట్లు గుర్తించింది. దీంతో సదరు మహిళ బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఆమె వేలి ముద్రల సహాయంతో రూ.20 వేలు ఆధార్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా బదిలీ అయినట్లు తెలిపారు.

సైబర్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఓటీపీ లేదా వేలిముద్రల సాయంతో AePS ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చని తెలిపారు. బాధిత మహిళ ఎవరితోనూ ఓటీపీని షేర్‌ చేసుకున ఉండకపోతే.. కేటుగాళ్లు ఖచ్చితంగా ఆమె వేలిముద్రను దొంగిలించి ఆమెకు తెలియకుండానే ఆమె ఖాతా నుంచి డబ్బు ఖాళీ చేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. తన వేలి ముద్రలను ఎవరితోనైనా పంచుకున్నారా అని పోలీసులు ఆమెను ప్రశ్నించగా ఇటీవల కొంత ఆస్తిని విక్రయించడానికి ఓ వ్యక్తికి బయోమెట్రిక్ వివరాలను ఇచ్చినట్లు మహిళ తెల్పింది.

ఇవి కూడా చదవండి

ఇటుంటి సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు సిలికాన్ పొరల ద్వారా వేలిముద్రలను సంగ్రహించి, ఆపై ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లోకి లాగిన్ చేసి డబ్బును దొంగిలిస్తుంటారు. అక్రమార్కులు ప్రధానంగా మైక్రో ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లు, క్రెడిట్-డెబిట్ కార్డ్ స్వైపర్‌ల వలె కనిపించే ప్రత్యేక పరికరాలను డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. OTPని పంచుకోకుండా ఎవరికైనా బయోమెట్రిక్స్ ఇవ్వడం లేదా ఇతరులకు వేలిముద్రలు ఇవ్వడంపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీస్‌ స్లీత్‌ సూచిస్తున్నారు. ఈ తరహా AePS సైబర్ నేరాలు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో తరచుగా నమోదవుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.