AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లగ్జరీ కారులో వచ్చారు.. అటూ ఇటూ చూశారు.. చివరకు ఏం ఎత్తుకెళ్లారో చూస్తే షాక్ అవుతారు..

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. అమేథీలో వీఐపీ తరహాలో దొంగలు చోరీకి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమేథీలో ఓ వ్యక్తి విలాసవంతమైన కారులో మేకల దొంగతనానికి పాల్పడ్డాడు. రాత్రి చీకటిలో దొంగలు కారును కొంత దూరంలో నిలిపారు. అనంతరం మేకను ఎక్కించుకుని పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. కారులోంచి మేకలను దొంగిలించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Shiva Prajapati
|

Updated on: Sep 13, 2023 | 5:39 AM

Share

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. అమేథీలో వీఐపీ తరహాలో దొంగలు చోరీకి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమేథీలో ఓ వ్యక్తి విలాసవంతమైన కారులో మేకల దొంగతనానికి పాల్పడ్డాడు. రాత్రి చీకటిలో దొంగలు కారును కొంత దూరంలో నిలిపారు. అనంతరం మేకను ఎక్కించుకుని పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. కారులోంచి మేకలను దొంగిలించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ ఘటన జైస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరానా ప్రాంతంలో చోటు చేసుకుంది. జహాన్ నివాసి మహ్ఫూజ్ అహ్మద్ తన ఇంటి సమీపంలో పడుకున్నాడు. మేకను కూడా అక్కడే కట్టేశారు. రాత్రి 2 గంటల సమయంలో తెల్లటి కారు వచ్చి కొంత దూరంలో పార్క్ చేసింది. అందులోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. మెల్లగా కట్టేసిన మేకను ఎత్తుకెళ్లి కారులోకి ఎక్కించాడు.

మేకల దొంగతనం సీసీటీవీలో రికార్డ్..

రాత్రి కావడంతో అంతా పడుకున్నారు. ఉదయం ఇంటి యజమానా లేచి చూశాక ఇంటి ముందు కట్టేసిన మేక కనిపింలేదు. దాంతో షాక్ అయిన ఇంటి యజమాని.. మేక కోసం తీవ్రంగా గాలించాడు. చుట్టుపక్కన అంతా వెతికాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఇంటి దగ్గర అమర్చిన సీసీ కెమెరాను పరిశీలించారు. అందులో షాకింగ్ సీన్ కనిపించింది. కొందరు దుండగులు.. కారులో వచ్చి మేకలు ఎత్తుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.

కారులో ఉప్పు చోరీ..

ఇంతకు ముందు, రామ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌గంజ్ పట్టణంలో లగ్జరీ కారులో వచ్చిన దొంగలు ఉప్పు బస్తాను దొంగిలించారు. అర్థరాత్రి వేళ కారులో వచ్చిన కేటుగాళ్లు.. కారులో ఐదు ఉప్పు బస్తాలు వేసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వైరల్‌గా మారింది. ఈ చోరీ ఘటనపై పోలీసులపై విచారణ చేపట్టారు. ఉప్పు దొంగలను పోలీసులు ఇంకా కనిపెట్టేదు.

ఈ విషయమై అమేథీ ఎస్పీ డాక్టర్ ఇలమార్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ కార్ రైడర్ మేకను దొంగిలించడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. నిందితలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై