Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram Crime: అయ్యో ఏం కష్టం వచ్చిందో..? బావిలో దూకి కుటుంబమంతా ఆత్మహత్య..

ఏం కష్టం వచ్చిందో తెలియదు.. కుటుంబం మొత్తం మూకుమ్మడిగా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య భర్తతోపాటు వారి కుమార్తె కూడా బావిలో శవాలై కనిపించారు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంకు చెందిన ఎండి మొహినుద్దీన్‌ (46) తన కుటుంబంతో విశాఖ నగరం..

Vizianagaram Crime: అయ్యో ఏం కష్టం వచ్చిందో..? బావిలో దూకి కుటుంబమంతా ఆత్మహత్య..
Family Committed Suicide By Jumping Into Well
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 12, 2023 | 3:40 PM

కొత్తవలస, సెప్టెంబర్‌ 12: ఏం కష్టం వచ్చిందో తెలియదు.. కుటుంబం మొత్తం మూకుమ్మడిగా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య భర్తతోపాటు వారి కుమార్తె కూడా బావిలో శవాలై కనిపించారు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంకు చెందిన ఎండి మొహినుద్దీన్‌ (46) తన కుటుంబంతో విశాఖ నగరం మర్రిపాలెం పరిధిలోని ఎఫ్‌సీఐ నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సంషినిషా (39), కుమార్తె ఫాతిమా జహీదా (17), కుమారుడు అలీ ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం (సెప్టెంబర్‌ 11) సాయంత్రం భార్య సంషినిషా, కుమార్తె ఫాతిమా జహీదా, కుమారుడు అలీతో కలిసి తమ సొంత ఊరైన కొత్తవలస సమీపంలోని చింతపాలెంలోని తమ స్థలం చూసేందుకు కుటుంబం అంతా వెళ్లారు.

అనంతరం వారి స్థలం వద్ద ఉన్న బావిలో కుటుంబం అంతా దూకారు. ఈ ఘటనలో మొహినుద్దీన్‌తోసహా అతని భార్య, కుమార్తె ముగ్గురు చనిపోయారు. కుమారుడు అలీ కొన ప్రాణాలతో బయటపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అలీని కాపాడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  కుటుంబంతో సహా మొహినుద్దీన్‌ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌ రెస్టారెంట్‌లో పెరుగు అడిగినందుకు కొట్టి చంపారు

బిర్యానీ అంటే హైదరాబాద్‌ గుర్తుకొస్తుంది. నిత్యం వేల కొద్ది భోజన ప్రియులు హోటల్లో బిర్యానీ లాగించేస్తుంటారు. తాజాగా గోల్కొండకు చెందిన సలీంఖాన్‌ అనే వ్యక్తి తొమ్మిది మంది స్నేహితులతో కలిసి పంజాగుట్టలోని మెరిడియన్‌ బిర్యానీ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ అతను బిర్యానీ తింటూ పెరుగు అడిగాడు. అంతే రెస్టారెంట్ సిబ్బంది మూకుమ్మడిగా అతనిపై దాడి చేసి చితక్కొట్టారు. వారి దెబ్బలు తాళలేక సదరు కస్టమర్ మృత్యువాత పడ్డాడు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సెకండ్‌ లాన్సర్‌,

ఇవి కూడా చదవండి

అక్కడ రెండు బిర్యానీలు తెప్పించుకొని తింటూ పెరుగు కావాలని వెయిటర్‌ను కోరాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో గట్టిగా అడిగారు. ఈ విషయమై అతని స్నేహితుల్లో మహమ్మద్‌ లియాఖత్‌(32) అనే వ్యక్తి సిబ్బందిని ప్రశ్నించాడు. దీంతో అక్కడి సిబ్బంది మొత్తం అతన్ని చితకబాదారు. పోలీసులు అక్కడికి చేరుకోగా పోలీసుల ఎదుట కూడా మరోమారు అతనిపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో గాయాలపాలైన లియాఖత్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడు. పోలీసులు హత్యానేరం కింద మెరిడియన్‌ హోటల్‌ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. కాగా మృతుడు లియాఖత్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంజాగుట్ట ఎస్సై శివశంకర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రమేశ్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మీడియాకు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.