Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Battery Cycle: బ్యాటరీ సైకిల్ తయారు చేసిన 60 యేళ్ల వృద్దుడు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణం

ఆలోచనలకు వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సు వారైనా వినూత్న ఆవిష్కరణలు సృష్టించవచ్చు అని నిరూపించాడు ఆరు పదుల వయసున్న ఒక పెద్దాయన. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన శక్తి సరిపోకపోవడంతో విన్నుత్నంగా ఆలోచించి తన కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. టాలెంటు ఎవరి అబ్బ సొత్తు కాదు అని నిరూపించిన చంద్రం అనే చిరు వ్యాపారిని చూసి నేటి యువత ఆశ్చర్యపోతుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్బీపూర్ గ్రామానికి..

Battery Cycle: బ్యాటరీ సైకిల్ తయారు చేసిన 60 యేళ్ల వృద్దుడు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణం
Pabbam Chandram
Follow us
P Shivteja

| Edited By: Srilakshmi C

Updated on: Sep 13, 2023 | 4:12 PM

సిద్దిపేట, సెప్టెంబర్‌ 13: ఆలోచనలకు వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సు వారైనా వినూత్న ఆవిష్కరణలు సృష్టించవచ్చు అని నిరూపించాడు ఆరు పదుల వయసున్న ఒక పెద్దాయన. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన శక్తి సరిపోకపోవడంతో విన్నుత్నంగా ఆలోచించి తన కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. టాలెంటు ఎవరి అబ్బ సొత్తు కాదు అని నిరూపించిన చంద్రం అనే చిరు వ్యాపారిని చూసి నేటి యువత ఆశ్చర్యపోతుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్బీపూర్ గ్రామానికి చెందిన పబ్బం చంద్రం అనే 60 సంవత్సరాలు వృద్దుడు. తనకు ఉన్న సైకిల్ పై ఊరూరా తిరుగుతూ చిన్నపిల్లలకు సంబంధించిన కురుకురే, బింగో లాంటి సామాన్లను కిరాణా షాపుల్లో వేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

గత 30 సంవత్సరాలుగా ఇదే జీవనోపాధిని పొందుతున్నాడు. కానీ ప్రస్తుతం వయసు మీద పడడం శరీరం ఆరోగ్యం సహకరించకపోవడంతో, కుటుంబ పరివారం పెరగడంతో కష్టపడలేక పోతున్నాడు. చనిపోయే వరకు తన రెక్కల కష్టంతోనే బ్రతకాలి అన్న ఆయన ఆశయం నుంచి ఒక తెలివైన ఉపాయాన్ని కనుక్కున్నాడు. ఆయన ఆలోచనలో నుంచి వచ్చిందే బ్యాటరీ సైకిల్.. మొదట్లో అందరూ ఇతనిని ఇతను చేస్తున్న పనిని అపహాస్యం చేశారు. ఒక ఎక్స్ఎల్ వాహనం తీసుకుంటే సరిపోతుంది కదా. ఈ వయసులో ఇలా చేసి ఈ పెద్దాయన సాధించేది ఏముంది అంటూ ఎన్నో మాటలు మాట్లాడిన వాళ్లకి తన పనితోనే సమాధానం చెప్పాలి అని అనుకున్నాడు. పెరిగిన రేట్లతో ఎక్స్ఎల్ వాహనం మెయింటెనెన్స్ కష్టం అని, అదికాకుండా వ్యాపారంలో అనుకున్న లాభాలు రావడంలేదని సొంతంగా ఓ బ్యాటరీ సైకిల్ ని తయారు చేసుకున్నాడు..ఇతని వల్ల ఏమవుతుంది అన్న నోటితోటే ఇతడు ఏదైనా చేయగలడు అని నిరూపించుకున్నాడు.

తన తెలివితో కేవలం 22వేల రూపాయలతో బ్యాటరీతో నడిచే సైకిల్ ని తయారుచేశాడు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు వెళ్లే లాగా రూపొందించాడు. ప్రస్తుతం అతను ఈ బ్యాటరీ సైకిల్ పై ఊరు తిరుగుతూ తన జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాడు.. తన కుటుంబ పోషణకు ఇక డోకా లేకుండా చూసుకుంటున్నాడు. అందుకే తెలివి ఎవడి అబ్బా సొత్తు కాదు, తలుచుకుంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని పెద్దాయన చంద్రం యువతకి నిదర్శనంగా నిలుస్తున్నాడు. ఎవరికైనా ఈ బ్యాటరీ సైకిల్ కావాలన్నా తనకు సహాయం చేస్తే తాను ఈ బ్యాటరీ సైకిల్ ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు చంద్రం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.