AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇక్కడి వీధుల్లో తేలు, బొద్దింక వేపుడు దొరుకుతుంది.. ఎలా వండాలో కూడా చూపిస్తున్నారు..

వివిధ జంతువుల కూరలు, కూరగాయలు, సూప్‌లు మొదలైనవి తయారు చేసి వినియోగిస్తారు. ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేశారు. మన దేశంలో భయపడే జంతువులను వీళ్లు లొట్టలేసుకుంటూ తింటున్నారని ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరు రాయిని కూడా వదలరని, మరికొందరు వాటిని చూస్తే వికారంగా ఉందని అంటున్నారు.

Viral Video: ఇక్కడి వీధుల్లో తేలు, బొద్దింక వేపుడు దొరుకుతుంది.. ఎలా వండాలో కూడా చూపిస్తున్నారు..
Thailand Street Food
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2023 | 6:54 PM

Share

ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి.. కాబట్టి వంటలో వైవిధ్యం ఉండాలి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేక ఆహారం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల వారు తినే ఆహారం చూస్తే వికారంగా అనిపిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. చాలా మంది సాయంత్రం వేళల్లో స్ట్రీట్‌ఫుడ్‌ పార్టీలు చేసుకునేందుకు బయటకు వెళ్తుంటారు. భారతదేశంలో, మోమోస్, సమోసా, దోస, గోల్గప్ప, మిర్చి బజ్జీలు మొదలైన వాటిని స్ట్రీట్ ఫుడ్ పేరుతో తింటారు. అయితే ప్రపంచంలో అసహ్యకరమైన జంతువుల వంటకాలు తయారుచేసి తినే దేశాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా..? ఇక్కడి ప్రజలు స్ట్రీట్‌ ఫుడ్‌ పేరుతో పీత, తేలు, బొద్దింక మొదలైన జీవులను వేయించి వాటిని చాలా ఇష్టంగా తింటారు. ఈ మాటలు మీకు హాస్యాస్పదంగా అనిపిస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఇది చూస్తే మీరు కూడా వాక్‌ అంటారు..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Saurabh Birari (@foodie_saurabh_)

ఓ స్ట్రీట్‌ఫుడ్‌ షాపులో చనిపోయిన తేళ్లను ప్లేట్లలో అమర్చి వాటిని తినేందుకు స్టైల్‌గా టూత్‌పిక్‌ను కూడా పెట్టారు. వేయించిన తేలును టూత్‌పిక్‌తో పట్టుకుని తింటూ ఆనందిస్తున్నారు ఇక్కడి భోజనప్రియులు. షాపులో పని చేస్తున్న ఓ మహిళ తేలును వేడి నూనెలో వేసి బాగా వేయించింది. ఎర్రగా వేగిన తేళ్లను ఓప్లేట్‌లోని తీసుకుని స్పైసీగా చేయడానికి చాట్ మసాలా చల్లింది. ఆపై మసాలా కూడా వేసి..సిద్ధం చేసింది. ఆ తర్వాత దాన్ని కస్టమర్లకు సర్వ్‌ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. Foodie_saurabh_ అనే పేరుతో ఉన్న Instagram ఖాతా తేలు, బొద్దింకల వేపుడు వీడియోను షేర్ చేసింది. దీని పేరు థాయ్‌లాండ్ స్ట్రీట్ ఫుడ్.

వీడియోలో తేలు మాత్రమే కాకుండా, బొద్దింక వంటకం తయారీ విధానాన్ని కూడా చూపించారు. ఆ లేడీ మొదట చాలా బొద్దింకలను తీసుకుని వాటిని కంటైనర్‌లో వేసి బాగా వేయించింది. తేళ్లు వలె, చాట్ మసాలాతో సహా అనేక మసాలాలు బొద్దింకలపై చల్లింది. ఇలాంటి డిషేస్‌ని ఇక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారట. అయితే, ఇలాంటి వంటకాలు ఎవర్రా బాబు అని మీరు షాక్‌ అవ్వొచ్చు. ఇలాంటి విచిత్రమైన, భయంకరమైన స్ట్రీట్ ఫుడ్స్‌ థాయిలాండ్‌లో కస్టమర్ల కోసం తయారు చేస్తున్నారు. అక్కడ వివిధ జంతువుల కూరలు, కూరగాయలు, పులుసులు మొదలైన వాటిని తయారు చేసి వినియోగిస్తారు. మీరు థాయిలాండ్‌లోని ప్రతి వీధిలో నాలుగువైపులా ఇలాంటి వంటకాలను చూస్తారు.

థాయిలాండ్‌లో వివిధ జంతువుల కూరలు, కూరగాయలు, సూప్‌లు మొదలైనవి తయారు చేసి వినియోగిస్తారు. ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేశారు. మన దేశంలో భయపడే జంతువులను తింటున్నారని ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరు రాయిని కూడా వదలరని, మరికొందరు వాటిని చూస్తే వికారంగా ఉందని అన్నారు.

థాయిలాండ్ మాత్రమే కాదు, చైనా ప్రజలు బొద్దింకలు, తేళ్లు, పాములు, పట్టు పురుగులు, తేనెటీగలను కూడా తింటారు అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..