గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన కోడి.. పిల్లులు, కుక్కలతో కలిసి తిరుగుతుంది.. టైమ్‌పాస్‌ కోసం టీవీ చూస్తుంది..ఇది ప్రపంచంలోనే..!

ఈ 21 ఏళ్ల కోడి పిల్లులు, కుక్కలు వంటి ఇతర జంతువులు ఉండే గదులలోనే ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే అది ఇతర జంతువులతో కలిసి ఉండటానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇది మొదటి ఇతర జంతువుల నుండి దూరంగా ఉండటానికి నిరాకరిస్తుంది. కొన్నిసార్లు పీనట్‌ కోడి ఇంట్లోకి వచ్చి మార్సీతో కూర్చుని జాలీగా టీవీ కూడా చూస్తూ ఆనందిస్తుంది.

గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన కోడి.. పిల్లులు, కుక్కలతో కలిసి తిరుగుతుంది.. టైమ్‌పాస్‌ కోసం టీవీ చూస్తుంది..ఇది ప్రపంచంలోనే..!
World’s Oldest Living Chicken
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 13, 2023 | 9:15 PM

సాధారణంగా మన ఇంట్లో పెంచే కోడి జీవితకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా? సుమారు ఐదేళ్ల నుంచి పదేళ్లు అనుకోవచ్చు. కొన్నిసార్లు కోడి జీవితకాలం దాని జాతి, కొన్ని ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది. అయితే యూఎస్‌లోని ఓ కోడి ఎక్కువ కాలం జీవించి గిన్నిస్‌ రికార్డు సాధించింది. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన ఓ దంపతులు తమ పొలంలో ఎన్నో జంతువులను పెంచుకుంటున్నారు. ఇందులో ఒక కోడి కూడా ఉంది. వారు మాంసం కోసం ఏ జంతువును చంపరు. దాంతో ఇక్కడ ఉన్న జంతువులన్నీ తమ పొలంలో తమ జీవితమంతా సంతోషంగా గడుపుతాయి. పీనట్ అనే కోడి ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు గల కోడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.

సగటు కోడి ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఈ కోడి దాదాపు 20 ఏళ్ల 272 రోజుల తర్వాత కూడా బతికే ఉంది. పీనట్‌ ఇది ఒక చిన్న తెలివైన కోడి. దీనికి రోజూ పెరుగు ఇవ్వాలి. పాపం ఈ కోడి జన్మకథ కూడా విషాధంగానే ఉంటుంది. ఎందుకంటే..గుడ్లు పెట్టిన తర్వాత పొదగకముందే దాని తల్లి వెళ్ళిపోయింది. దాంతో ఆ గుడ్డు కుళ్ళిపోయి ఉండొచ్చునని అనుకున్నారు. దాన్ని దూరంగా చెరువులో పడేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే గుడ్డు లోపల నుంచి శబ్దం వినిపించింది. దాంతో ఆ యజమాని మార్సీ ఆ గుడ్డు పెంకును కొద్దికొద్దిగా ఒలిచి, కోడిపిల్లను తన చేతిలోకి తీసుకుని వెంటనే తల్లి కోడి వద్దకు తీసుకువెళ్లింది. కానీ తల్లి కోడి తన కోడిపిల్లను అంగీకరించలేదు. మార్సీ ఆ కోడిపిల్లను తానే పెంచుకోవాలని నిర్ణయించుకుని దానికి పీనట్ అని పేరు పెట్టింది. అది చాలా చిన్నది కాబట్టి ఈ పేరు పెట్టారట. ఇక్కడ కనిపించే వీడియోలో పీనట్‌ పిల్లులతో కలిసి ఆడుకుంటుంది. ఇతర కోళ్లు, అతని యజమాని మార్సీతో ఆనందంగా గడుపుతుంది.

ఇవి కూడా చదవండి
The World’s Oldest Living Chicken

ఈ 21 ఏళ్ల కోడి పిల్లులు, కుక్కలు వంటి ఇతర జంతువులు ఉండే గదులలోనే ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే అది ఇతర జంతువులతో కలిసి ఉండటానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇది మొదటి ఇతర జంతువుల నుండి దూరంగా ఉండటానికి నిరాకరిస్తుంది. కొన్నిసార్లు పీనట్‌ కోడి ఇంట్లోకి వచ్చి మార్సీతో కూర్చుని జాలీగా టీవీ కూడా చూస్తూ ఆనందిస్తుంది. పురాతన కోడిగా గతంలో ముఫీ అనే కోడి గుర్తింపును సాదించింది. 2011లో చనిపోయిన ఈ కోడి 23 ఏళ్ల 152 రోజులు ఈ భూమిపై జీవించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?