Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mantralayam: రాఘవేంద్ర మఠాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని రిషి తల్లిదండ్రులు, అత్తగారు

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు యశ్వీర్ సునక్ లు  శ్రీ క్షేత్రం మంత్రాలయాన్ని సందర్శించారు. రిషి తల్లిదండ్రులతో పాటు రిషి అత్తగారు ఇన్ఫోసిస్‌కి వైస్ చైర్మన్ సుధా నారాయణ మూర్తి కలిసి శ్రీ రాయారు దర్శనం చేసుకున్నారు. రాఘవేంద్ర స్వామి సందర్శనం చేసుకున్న వీరికి  పవిత్రమైన శ్రీ స్వామీజీ వస్త్రం, ఫల మంత్రాక్షతలతో పాటు రాఘవేంద్ర స్వామి జ్ఞాపికతో ఆశీర్వాదాన్ని అందించారు.

Mantralayam: రాఘవేంద్ర మఠాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని రిషి తల్లిదండ్రులు, అత్తగారు
Pm Rishi Parents Visit Mantralayam
Follow us
Surya Kala

|

Updated on: Sep 14, 2023 | 8:24 AM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం. తుంగభద్రా నది ఒడ్డున  వెలసిన క్షేత్రంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం.. దీనిని గతంలో దక్షిణాది మఠం లేదా విజయేంద్ర మఠం అని పిలిచేవారు. మూడు ప్రధాన ద్వైత వేదాంత మఠాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సమాధి పొందిన రాఘవేంద్రస్వామిని ప్రహ్లాదుడి అవతారంగా భావించి కొలుస్తారు. భక్తుల పాలిట కొంగుబంగారం గా ఖ్యాతిగాంచారు. తాజాగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌ తల్లిదండ్రులు కర్నూలు జిల్లాలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు.

రిషి సునక్ తల్లిదండ్రులు యశ్వీర్, ఉషా సునక్, రిషి సునక్ అత్తగారు సుధా మూర్తితో కలిసి మంత్రాలయం లోని ఆలయంలో పూజలు చేసి.. ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించింది.

“బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు యశ్వీర్ సునక్ లు  శ్రీ క్షేత్రం మంత్రాలయాన్ని సందర్శించారు. రిషి తల్లిదండ్రులతో పాటు రిషి అత్తగారు ఇన్ఫోసిస్‌కి వైస్ చైర్మన్ సుధా నారాయణ మూర్తి కలిసి శ్రీ రాయారు దర్శనం చేసుకున్నారు”

ఇవి కూడా చదవండి

“రాఘవేంద్ర స్వామి సందర్శనం చేసుకున్న వీరికి  పవిత్రమైన శ్రీ స్వామీజీ వస్త్రం, ఫల మంత్రాక్షతలతో పాటు రాఘవేంద్ర స్వామి జ్ఞాపికతో ఆశీర్వాదాన్ని అందించారు. అంతేకాదు రాఘవేంద్ర స్వామి పవిత్ర ప్రసాదాన్ని తల్లిదండ్రులకు బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్‌కు సహా అందరికి పంచిపెట్టమని ఇచ్చారు.

మఠం బ్రిటీష్ ప్రధాని తల్లిదండ్రులు, అత్తగారికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా పోస్ట్ చేసింది.

రిషి సునక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఆదివారం న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.

G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి తన భారతీయ మూలాల గురించి ప్రస్తావిస్తూ.. భారత్‌తో తనకున్న సంబంధానికి తాను చాలా గర్వపడుతున్నట్లు చెప్పారు. సునక్ తనను తన భార్య హిందువులైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. తాము తమ మూలలను మరచిపోమని.. ఎప్పుడూ భారతదేశంతో, భారతదేశ ప్రజలతో మంచి సంబంధం కలిగి ఉండమని తెలిపారు.

గతేడాది ప్రధానమంత్రి అయిన తర్వాత రిషి సునక్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా రిషి  తల్లిదండ్రులు గతేడాది వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.