AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Board: టీటీడీ సభ్యులకు, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. అనర్హులను సభ్యులుగా నియమించడం పై అభ్యంతరం

కొత్తగా టీటీడీ సభ్యులను ప్రభుత్వం నియమించింది. వారికీ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అనర్హులను సభ్యులుగా నియమించడంపై అభ్యంతరం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. టీటీడీలో ఏర్పాటు చేసిన కొత్త పాలకమండలి సభ్యుల్లో కొందరికి నేర చరిత్ర ఉందని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది.

TTD Board: టీటీడీ సభ్యులకు, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. అనర్హులను సభ్యులుగా నియమించడం పై అభ్యంతరం
Ttd Board
Surya Kala
|

Updated on: Sep 14, 2023 | 7:44 AM

Share

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయాన్ని నిర్వహించే సంస్థ టీటీడీ.. ఈ సంస్థ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం స్వామివారి ఆలయం బాగోగులు చూడడమే.. అంతేకాదు దేశం నలువైపులా వివిధ సామజిక, ధార్మిక, సాంస్కృతి వంటి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ ధర్మాన్ని విస్తరింపజేస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ సంస్థ నిర్వహణ కోసం చైర్మన్, బోర్డు మెంబర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే కొత్తగా టీటీడీ సభ్యులను ప్రభుత్వం నియమించింది. వారికీ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నేర చరిత్ర ఉన్నవారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై అభ్యంతరం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.

టీటీడీలో ఏర్పాటు చేసిన కొత్త పాలకమండలి సభ్యుల్లో కొందరికి నేర చరిత్ర ఉందని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డికి పర్సనల్ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు విజయవాడకి చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు.. మంచి నడవడిక లేని, అనర్హులను, నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టుకు విన్నవించారు.. పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ రఘునందన రావు ధర్మాసనం.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. శిక్ష ఇంకా విధించని కారణంగా వారు నేరస్థులుగా పరిగణించలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.

మరోవైపు.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఇండియా సభ్యత్వం నుండి తొలగింప బడిన కేతన్ దేశాయ్‌ను టీటీడీ సభ్యుడిగా నియమించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు చింతా వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది శ్రావణ్.ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని, సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు వున్నాయని పిటిషనర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..