Engagement Sweets: కోనసీమ మజాకా..! నిశ్చితార్థ వేడుకలో దుమ్మురేపిన సారె.. మాములుగా లేదంటున్న అతిథులు
Konaseema District: వాటితో పాటు మూడు రకాల పాలకోవాలు.. కోనసీమ కోవా,మార్టేరు కోవా, పెద్దాపురం పాలకోవా. నాలుగు రకాల కాజాలు వాటిలో కాకినాడ గొట్టం కాజా, తాపేశ్వరం మడత కాజా, నెల్లూరు మలై కాజా, విజయనగరం గరివిడి కాజా. మళ్లీ రెండు రకాల హాల్వాలు.. మాడుగుల హల్వా, బందరు హాల్వా. మూడు రకాల పూతరేకులు.. ఆత్రేయపురం పూతరేకులు, మంచిలి పూతరేకులు, కొవ్వాడ పూతరేకులు. ఒంగోలు మైసూర్ పాక్.. అంతేకాకుండా
కోనసీమ జిల్లా, సెప్టెంబర్ 13: కోనసీమకు చెందిన అబ్బాయికి.. యానం అమ్మాయికి జరిగిన ఎంగెజ్ మెంట్ ఫంక్షన్ లో అబ్బాయి బందువులు అమ్మాయి బంధువులకు ఇచ్చిన స్వీట్స్ చాలా ఎట్రాక్షన్ గా నిలిచాయి. గోదారిజిల్లాల్లో నిశ్చితార్ధాల్లో అబ్బాయి తరపువాళ్ళు అమ్మాయి తరపు వాళ్లకు స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకెళ్లడం అనవాయితీ…. అయితే సాధరణంగా ఎంత పెద్ద మొత్తంలో స్వీట్స్ తీసుకెళ్లినా ఒకే స్వీట్స్ షాపులో ఈ స్వీట్స్ అన్ని తయారుచేయించి తీసుకెళుతుంటారు. కానీ యానంలో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ లో మాత్రం ఎపిలో ఫేమస్ అయిన దాదాపు అన్ని రకాల స్వీట్స్ తీసుకెళ్లి అందరిని ఆశ్చర్య పరిచారు…కోనసీమ ఆత్మీయం అంటే ఏంటో స్వీట్స్ రూపంలో చూపించారు..మొత్తం 28 రకాల స్వీట్స్ తో పాటు.. డజన్ల కొద్ది ఫ్రూట్స్… పెద్ద పటిక బెల్లం అచ్చు.. తీసుకెళ్లారు…. స్వీట్స్ విషయానికోస్తే అటు శ్రీకాకుళం సోంపేట ఉటంకీ దగ్గర నుంచి ఇటు నెల్లూరు మలై కాజా వరకు అన్ని జిల్లాలనుంచి ఫేమస్ స్వీట్స్ తీసుకొచ్చారు.
అందులో మూడు ఫేమస్ టెంపుల్ ప్రసాదాలు కూడా ఉన్నాయి.. తిరుమల శ్రీవారి లడ్డూ, బెజవాడ దుర్గమ్మలడ్డూ, అన్నవరం ప్రసాదం. వాటితో పాటు మూడు రకాల పాలకోవాలు.. కోనసీమ కోవా,మార్టేరు కోవా, పెద్దాపురం పాలకోవా. నాలుగు రకాల కాజాలు వాటిలో కాకినాడ గొట్టం కాజా, తాపేశ్వరం మడత కాజా, నెల్లూరు మలై కాజా, విజయనగరం గరివిడి కాజా. మళ్లీ రెండు రకాల హాల్వాలు.. మాడుగుల హల్వా, బందరు హాల్వా. మూడు రకాల పూతరేకులు.. ఆత్రేయపురం పూతరేకులు, మంచిలి పూతరేకులు, కొవ్వాడ పూతరేకులు. ఒంగోలు మైసూర్ పాక్.. అంతేకాకుండా మూడు రకాల లడ్డూలు.. బందరు లడ్డూ, కూరాడ లడ్డూతో పాటు
హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన మోతిచూర్ లడ్డూ. అలాగే కోనసీమ ఫేమస్ అల్లవరం మల్లారపు ఉండలు, నగరం గరాజీలు,మందపల్లి బొబ్బట్టు, మోరి జీడిపప్పు అచ్చు, కరకజ్జం అచ్చు.. ఆత్రేయపురం మామిడితాండ్ర, పెనుగోండ కజ్జికాయలు.. ఇలా ఫేమస్ స్వీట్స్ తో ఎంగేజ్ మెంట్ అదరగొట్టేశారు. ప్రతి స్వీటు కూడా దాని ఆరిజన్ ప్లేస్ నుంచి తాజాగా తీసుకురావడానికి మూడు రోజులు సమయం పట్టింది. అంటున్నారు బందువులు….ఇంకెందుకు ఆలస్యం గోదావరి జిల్లా స్వీట్స్ తినేందుకు రండి మరి అంటున్నారు గోదావరి జిల్లాల బందువులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి