Watch Video: బాబోయ్ ఏం ట్విస్ట్ ఇచ్చాడు.. పరుగెత్తుకుంటూ వెళ్లి లోయలోకి దూకాడు.. కట్ చేస్తే..

జివ్హకో రుచి.. పుర్రకో బుద్ది అంటారు పెద్దలు. అవును మరి.. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి.. ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. మనిషికి మనిషికి మధ్య పోలికలు ఉండనట్లే.. వారి వారి అభిప్రాయాలు, అభిరుచులకు మధ్య కూడా ఏమాత్రం పోలికలు, పొంతనలు ఉండవు. కొందరికి అడ్వేంచర్స్, స్టంట్స్ చేయడం అంలా చాలా ఇష్టం లైఫ్ రిస్క్‌ అని తెలిసినా.. లెక్క చేయకుండా స్టంట్స్ చేస్తుంటారు. వారి విన్యాసాలు.. అవతలి వారికి హార్ట్ స్ట్రోక్ తెప్పించేలా ఉంటాయి. కొందరు వ్యక్తులు రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తే.. మరికొందరు సన్నని తాడుపై నడుస్తూ స్టంట్స్ చేస్తుంటారు. ఇంకొందరు విన్యాసాలు చేయడానికి ఎత్తైన కొండలను ఎంచుకుంటారు.

Watch Video: బాబోయ్ ఏం ట్విస్ట్ ఇచ్చాడు.. పరుగెత్తుకుంటూ వెళ్లి లోయలోకి దూకాడు.. కట్ చేస్తే..
Man Stunts
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 14, 2023 | 7:16 AM

జివ్హకో రుచి.. పుర్రకో బుద్ది అంటారు పెద్దలు. అవును మరి.. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి.. ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. మనిషికి మనిషికి మధ్య పోలికలు ఉండనట్లే.. వారి వారి అభిప్రాయాలు, అభిరుచులకు మధ్య కూడా ఏమాత్రం పోలికలు, పొంతనలు ఉండవు. కొందరికి అడ్వేంచర్స్, స్టంట్స్ చేయడం అంలా చాలా ఇష్టం లైఫ్ రిస్క్‌ అని తెలిసినా.. లెక్క చేయకుండా స్టంట్స్ చేస్తుంటారు. వారి విన్యాసాలు.. అవతలి వారికి హార్ట్ స్ట్రోక్ తెప్పించేలా ఉంటాయి. కొందరు వ్యక్తులు రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తే.. మరికొందరు సన్నని తాడుపై నడుస్తూ స్టంట్స్ చేస్తుంటారు. ఇంకొందరు విన్యాసాలు చేయడానికి ఎత్తైన కొండలను ఎంచుకుంటారు. కొండపై నుంచి దూకేస్తారు. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరం, ఇందులో చిన్నపాటి పొరపాటు జరిగినా కూడా ప్రాణాలుు గాల్లో కలవాల్సిందే. ఇలాంటి విన్యాసాలు చేయడంలో అనుభవం ఉన్నవారే చేస్తారు. తాజాగా అలాంటి ఒక స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇది చూస్తే కళ్లు తేలేస్తారు.

ఈ వీడియోలో ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి.. ఓ ఎత్తైన కొండపై నుండి దూకుతాడు. అయితే, కొంత సమయం వరకు అతని పారాచూట్ తెరుచుకోలేదు. చివరి క్షణంలో అతని పారాచూట్ తెరుచుకుంది. దాంతో అతను సేఫ్‌గా బయటపడ్డాడు. అయితే, అతని స్టంట్‌ను గుర్తించని జనాలు.. మొదట షాక్ అయ్యారు. అతను పరుగెత్తుకుంటూ కొండపై నుంచి లోయలోకి దూకడంతో షాకైన చుట్టు పక్కన జనాలు.. పెద్ద పెద్దగా కేకలు వేశారు. అతన్ని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. అవేవీ వినకుండా ఆ వ్యక్తి నేరుగా కొండపై నుంచి దూకేశాడు. అయితే, తన బ్యాలెన్స్ సరిగా లేకపోవడంతో.. వెంటనే పారాచూట్ తెరిచాడు. కాసేపటి తరువాత అది తెరుచుకుంది. దాంతో అతను సేఫ్‌గా బయటపడ్డాడు.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘సోదరా, నెక్ట్స్ వరల్డ్‌కి వెళ్లడానికి కేవలం రెండడుగుల దూరంలో ఉన్నావు’ అంటూ కామెంట్స్ పెట్టారు. 12 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు 98 వేలకు పైగా వీక్షించగా.. వేలాది లైక్స్ వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..