Red Wine: వీధుల్లో నదిలా పారిన రెడ్‌ వైన్‌..! స్విమ్మింగ్‌ పూల్‌ని తలపించిన ప్రవాహం.

Red Wine: వీధుల్లో నదిలా పారిన రెడ్‌ వైన్‌..! స్విమ్మింగ్‌ పూల్‌ని తలపించిన ప్రవాహం.

Anil kumar poka

|

Updated on: Sep 14, 2023 | 8:35 AM

భారీ వర్షాలకు నదులు పోటెత్తి పొంగిపొర్లుతూ నగరాలను, గ్రామాలను ముంచెత్తడం మనం చూశాం. కానీ అక్కడ వైన్‌ ఆ పట్టణ వీధులను ముంచెత్తింది. అవును పోర్చుగల్‌లో రెడ్‌ వైన్‌ వీధుల్లో నదీప్రవాహంలా పొంగిపొర్లింది. ఏకంగా 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్ వీధిలో నదిలా ప్రవహించింది. ఈ రెడ్ వైన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోర్చుగీస్ లోని సావో లోరెంకో డి బైరో లోని వైన్ తయారీ పరిశ్రమలో..

భారీ వర్షాలకు నదులు పోటెత్తి పొంగిపొర్లుతూ నగరాలను, గ్రామాలను ముంచెత్తడం మనం చూశాం. కానీ అక్కడ వైన్‌ ఆ పట్టణ వీధులను ముంచెత్తింది. అవును పోర్చుగల్‌లో రెడ్‌ వైన్‌ వీధుల్లో నదీప్రవాహంలా పొంగిపొర్లింది. ఏకంగా 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్ వీధిలో నదిలా ప్రవహించింది. ఈ రెడ్ వైన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోర్చుగీస్ లోని సావో లోరెంకో డి బైరో లోని వైన్ తయారీ పరిశ్రమలో 600,000 గ్యాలన్ల మద్యాన్ని నిల్వచేసిన బారెల్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దాంతో రెడ్‌ వైన్‌ మొత్తం వీధిపాలైంది. నదీ మాదిరిగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించిన దృశ్యాలను కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లీక్ అయిన ఈ రెడ్ వైన్ ఒలింపిక్-స్విమ్మింగ్ పూల్‌ని తలపిస్తోంది. వైన్‌ని ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినా సాధ్యంకాలేదు. కానీ అనాడియా ఫైర్ డిపార్ట్‌మెంట్ ఈ రెడ్ వైన్ వరదను సెర్టిమా నదిలో కలవకుండా దారి మళ్లించారు. అక్కడి నుంచి వైన్ ప్రవాహం సమీపంలోని పొలంలోకి వెళ్లిందని స్థానిక మీడియా తెలిపినట్టు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..