Kim Jong Un: ట్రైన్‌లో రష్యా వెళ్లిన కిమ్ జోంగ్ ఉన్.. కిమ్ కు నిజంగానే విమానం అంటే భయమా.
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యేందుకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సెప్టెంబర్ 11న రష్యాకు చేరుకున్నారు. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ నుంచి 681 కిలోమీటర్ల దూరంలోని రష్యా నగరం వ్లాదివోస్తోక్ చేరేందుకు కిమ్ తన సొంత రైలులో ప్రయాణించారు. దాదాపు 20 గంటలు ప్రయాణించి కిమ్ రష్యా చేరుకున్నారు. కిమ్ రాకను రష్యా వర్గాలు ధ్రువీకరించాయి.
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యేందుకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సెప్టెంబర్ 11న రష్యాకు చేరుకున్నారు. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ నుంచి 681 కిలోమీటర్ల దూరంలోని రష్యా నగరం వ్లాదివోస్తోక్ చేరేందుకు కిమ్ తన సొంత రైలులో ప్రయాణించారు. దాదాపు 20 గంటలు ప్రయాణించి కిమ్ రష్యా చేరుకున్నారు. కిమ్ రాకను రష్యా వర్గాలు ధ్రువీకరించాయి. అయితే దేశ అధ్యక్షుడైన కిమ్ విమానంలో కాకుండా ఇలా రైలులో ప్రయాణించడమేంటని అనిపించవచ్చు. అందుకు కారణం లేకపోలేదు. కిమ్ జోంగ్ ఉన్ తాత, నార్త్ కొరియా మాజీ ప్రెసిడెంట్ కిమ్ 2 సంగ్ కు విమాన ప్రయాణాలంటే భయం.. అందుకే దూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ఈ రైలును డిజైన్ చేయించుకున్నారు. పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కోచ్ లు, ప్రత్యేకమైన కిచెన్ తో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కు కూడా విమాన ప్రయాణాలంటే భయమే. అందుకే ఆయనకూడా ఈ రైలునే ఉపయోగించారు. ఇక కిమ్ జోంగ్ ఉన్‌కు విమాన ప్రయాణాలంటే భయం లేకపోయినా.. తన పూర్వీకులకు గౌరవసూచకంగానే ఆయన ఈ రైలును ఉపయోగించారని నార్త్ కొరియా పేర్కొంది. ఈ ట్రైన్‌కు భారీ ఆర్మడ్ ఫోర్సర్ ప్రొటెక్షన్ ఉంటుంది. స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న ఈ సాయుధ దళాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా స్టేషన్లను, రూట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలులో దాదాపు 91 కోచ్‌లు ఉంటాయి. ఈ స్పెషల్ ట్రైన్ వేగం కూడా చాలా తక్కువ. గరిష్ఠంగా గంటకు 59 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. లోపల అధ్యక్షుడి కోసం విలాసవంతమైన ఏర్పాట్లు, పొడవైన టేబుళ్లు, ఫ్లాట్ స్క్రీన్ మానిటర్లుతోపాటు, రష్యన్, చైనీస్, కొరియన్, జపనీస్, ఫ్రెంచ్ వంటకాలను అప్పటికప్పుడు వండి వడ్డించేందుకు రెడీగా ఉంచుతారు. కిమ్ తో పాటు ఆయన ప్రయాణించే కార్లను కూడా ఈ రైలులో తీసుకెళ్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..