Bolivia: ఆ జైల్లో ఖైదీలే గార్డ్స్.. నేరస్థులే ఉద్యోగస్తులు.. వింత జైలు.. ఎక్కడంటే.?
జైలు పేరు వినగానే ఇరుకైన సెల్‌లు, ఖైదీల రోదనలు, కర్కశత్వం వంటివి మనసులో మెదులుతాయి. కానీ ప్రతి నేరస్థుడు వెళ్లాలనుకునే ప్రపంచంలో కొన్ని జైళ్లు ఉన్నాయి. ఇవి ఫైవ్ స్టార్ హోటల్స్‌కి తక్కువేమి కాదు. అలాంటి ఓ వింత జైలు ఒకటి ఉంది. ఈ జైల్లో ఖైదీలే ఉద్యోగస్తులు. ఖైదీలను కాపలా కాయడానికి గార్డ్స్ ఉండరు. ఖైదీల కౌన్సిల్ ఉంటుంది. వారు శిక్షలు వేస్తారు. అమలు చేస్తారు. ఖైదీలకు కఠిన శిక్షలు ఉంటాయి. ఆ వింత జైలు ఎక్కడంటే?
జైలు పేరు వినగానే ఇరుకైన సెల్‌లు, ఖైదీల రోదనలు, కర్కశత్వం వంటివి మనసులో మెదులుతాయి. కానీ ప్రతి నేరస్థుడు వెళ్లాలనుకునే ప్రపంచంలో కొన్ని జైళ్లు ఉన్నాయి. ఇవి ఫైవ్ స్టార్ హోటల్స్‌కి తక్కువేమి కాదు. అలాంటి ఓ వింత జైలు ఒకటి ఉంది. ఈ జైల్లో ఖైదీలే ఉద్యోగస్తులు. ఖైదీలను కాపలా కాయడానికి గార్డ్స్ ఉండరు. ఖైదీల కౌన్సిల్ ఉంటుంది. వారు శిక్షలు వేస్తారు. అమలు చేస్తారు. ఖైదీలకు కఠిన శిక్షలు ఉంటాయి. ఆ వింత జైలు ఎక్కడంటే? బొలీవియాలోని అతి పెద్ద జైలు శాన్ పెడ్రో ఎన్నో వింతలకు నిలయం.. ఖైదీలకు కొన్ని సౌకర్యాలతో పాటు కొన్ని కఠిన నియమాలు కూడా ఉంటాయి. దాదాపు 3 వేల మంది ఖైదీలు ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. ఏ వసతి కావాలన్నా వారు కొనుక్కోవాలి.. లేదా అద్దెకు తీసుకోవాలి. కావాలంటే వారి కుటుంబంతో కూడా ఉండవచ్చు. వింతగా ఉంది కదా. ఈ జైలుని నేరస్తులే నిర్వహిస్తున్నారు. జైలు లోపల కూడా గార్డ్స్ ఎవరూ కాపలా ఉండరు. జైలులో ఏర్పాటు చేసుకున్న ఖైదీల కౌన్సిల్ నియమాలను రూపొందించి శిక్షలను నిర్ణయిస్తారు. జైలులో ఉండే స్విమ్మింగ్ పూల్‌ను ఉరిశిక్షల కోసం వినియోగిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేరస్తుడికి ఉరి వేస్తున్నప్పుడు తోటి ఖైదీలు సంగీతం ప్లే చేస్తారట. శాన్ పెడ్రో జైలులో ఉండటానికి ఖైదీల కుటుంబ సభ్యులుకూడా ఇష్టపడతారు. ఖైదీలు తమ సెల్‌ను అద్దెకు తీసుకోవచ్చు. రేపిస్టులు, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరస్తులకు జైలులో కఠిన శిక్షలు అమలు చేస్తారు. రస్టీ యంగ్ అనే రైటర్ ఒకసారి శాన్ పెడ్రో జైల్‌లో లంచం ఇచ్చి 4 నెలలు అక్కడే ఉండి ‘మార్చింగ్ పౌడర్’ అనే పుస్తకాన్ని రాసాడు. శాన్ పెడ్రో జైలు ఇతర జైళ్ల కంటె పూర్తి భిన్నంగా ఉంటుంది. రెస్టారెంట్లు, చర్చిలు, స్కూళ్లు, చిన్న వ్యాపారాలు కూడా లోపల ఉంటాయి. ఇలాంటి విడ్డురాలు ఉండబట్టే ఈ జైలు గురించి వింతగా చెప్పుకుంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

