Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Protection: కార్లలో ఎయిర్ బ్యాగ్స్.. ఫోన్లకూ వస్తే! ఇక ఫోన్ కింద పడినా పగలదుగా! ఇది సాధ్యమేనా? ఈ స్టోరీ చదవండి..

మీరు ఒకవేళ ఏదైనా ఫోన్ కొనుగోలు చేస్తే దాని రక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అందుకోసం స్క్రీన్ పై ట్యాంపర్డ్ గ్లాస్, ఫోన్ బాడీ ప్రొటెక్షన్ కోసం ఫోన్ కేసు వంటివి తీసుకుంటారు. ఫోన్ అనుకోని విధంగా కింద పడిపోయినప్పుడు ఇవి ఫోన్ ను సంరక్షిస్తాయి. అయినప్పటికీ కొన్నికొన్ని సందర్భాల్లో ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్న ఫోన్ కిందపడిపోయి పగిలిపోతుంటుంది. అందుకే ఫోన్ ను భద్రపరిచే ఫోన్ కేస్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది.

Phone Protection: కార్లలో ఎయిర్ బ్యాగ్స్.. ఫోన్లకూ వస్తే! ఇక ఫోన్ కింద పడినా పగలదుగా! ఇది సాధ్యమేనా? ఈ స్టోరీ చదవండి..
Phone Protection
Follow us
Madhu

|

Updated on: Sep 15, 2023 | 1:59 PM

కారులో ఎయిర్ బ్యాగ్స్ గురించి అందరూ వినే ఉంటూరు. చాలా మంది తరచూ చూస్తూనే ఉంటారు. కారు ప్రయాణిస్తున్నప్పుడు అనుకోని విధంగా కారు క్రాష్ అయితే అవి అత్యవసరంగా తెరచుకొని కారులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు కాపాడేందుకు దోహదపడతాయి. ప్రతి కారులో ఇవి ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఇదే రకమైన భద్రతను ఫోన్లకు ఉంది. ఫోన్ కి కూడా ఎయిర్ బ్యాగ్ తగిలించవచ్చా? అది ఎలా సాధ్యం? తెలుసుకుందాం రండి..

ఫోన్ భద్రతకు ప్రాధాన్యం..

మీరు ఒకవేళ ఏదైనా ఫోన్ కొనుగోలు చేస్తే దాని రక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అందుకోసం స్క్రీన్ పై ట్యాంపర్డ్ గ్లాస్, ఫోన్ బాడీ ప్రొటెక్షన్ కోసం ఫోన్ కేసు వంటివి తీసుకుంటారు. ఫోన్ అనుకోని విధంగా కింద పడిపోయినప్పుడు ఇవి ఫోన్ ను సంరక్షిస్తాయి. అయినప్పటికీ కొన్నికొన్ని సందర్భాల్లో ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్న ఫోన్ కిందపడిపోయి పగిలిపోతుంటుంది. అందుకే ఫోన్ ను భద్రపరిచే ఫోన్ కేస్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది. ఇది బాగా వైరల్ అయిపోయింది. అంటే మీ బ్యాక్ కవర్ లోనే ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఎప్పుడైనా అనుకోని విధంగా ఫోన్ కింద పడిపోతే వెంటనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి ఫోన్ ని సంరక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎవరు దీనిని తీసుకొచ్చింది..

ఈ ఎయిర్ బ్యాగ్ ఫోన్ కేస్ వినియోగిస్తూ ఓ యువకుకు తన ఇన్ స్టాగ్రామ్ పేజీపై ఓ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో తన ఫోన్ ని ఎయిర్ బ్యాగ్ ఏవిధంగా సంరక్షించిందో చూపించాడు. ఆ ఎయిర్ బ్యాగ్ ఫోన్ కేస్ ను ఆర్డర్ చేసి దానిని పరీక్షించాడు. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన క్లిప్ లో కొంత ఎత్తు నుంచి తన ఫోన్ వదిలేయడం కనిపించింది. ఫోన్ నెలను తాకే చివరి సెకన్లో ఎయిర్ బ్యాగ్ కవర్ నుంచి ఓపెన్ అయ్యి ఫోన్ ని సంరక్షించింది. బావుంది కదా! ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేసేయండి. ఎయిర్ బ్యాగ్ ఫోన్ కేస్ ఆన్ లైన్ లో వెతికితే ఇట్టే దొరుకుతుంది. వెంటనే ఆర్డర్ చేసేయండి.

View this post on Instagram

A post shared by Vector (@__vector__)

ఫుల్ వైరల్..

ఈ వీడియో ఆగస్టు 21న వెక్టర్ అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండ్లర్ తన పేజీపై పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇది 55 మిలియన్ల వ్యూస్ సాధించింది. ప్రతి రోజూ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఎయిర్ బ్యాగ్ ఫోన్ కేస్ చూసిన వినియోగదారులు తామూ దీనిని కొనుగోలు చేస్తామని, ఇది అద్భుతమని, ఇది నాకూ కావాలని, నేనూ ఆర్డర్ చేశా అని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పరగడుపున ఈ ఒక్కటీ తీసుకుంటే ఆ జబ్బులన్నీ పరార్..
పరగడుపున ఈ ఒక్కటీ తీసుకుంటే ఆ జబ్బులన్నీ పరార్..
Video: అరే ఆజామూ.. లేడీ ఫ్యాన్‌ని అలా వెక్కివెక్కి ఏడ్పిస్తావా
Video: అరే ఆజామూ.. లేడీ ఫ్యాన్‌ని అలా వెక్కివెక్కి ఏడ్పిస్తావా
అవన్నీ పట్టించుకోవడం మానేశా అంటున్న నిత్యామీనన్‌.. ఏంటవి.?
అవన్నీ పట్టించుకోవడం మానేశా అంటున్న నిత్యామీనన్‌.. ఏంటవి.?
కియా ఫ్యాక్టరీలో కారు ఇంజిన్ల మాయం కేసులో పురోగతి
కియా ఫ్యాక్టరీలో కారు ఇంజిన్ల మాయం కేసులో పురోగతి
ఆ హీరో తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందిపెట్టాడు.. హీరోయిన్
ఆ హీరో తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందిపెట్టాడు.. హీరోయిన్
ఈ వేసవిలో మేలో మోట్సుతో సహా ఈ పండుగలను ఆస్వాదించండి..
ఈ వేసవిలో మేలో మోట్సుతో సహా ఈ పండుగలను ఆస్వాదించండి..
ఆ దేశపు సైనికులపై ఏలియన్స్‌ దాడి..? CIA సంచలన రిపోర్ట్
ఆ దేశపు సైనికులపై ఏలియన్స్‌ దాడి..? CIA సంచలన రిపోర్ట్
పర్యావరణ ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవు: సుప్రీం హెచ్చరిక
పర్యావరణ ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవు: సుప్రీం హెచ్చరిక
ఆకర్షిస్తున్న వ్యాగన్ ఆర్ నయా ఎడిషన్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్
ఆకర్షిస్తున్న వ్యాగన్ ఆర్ నయా ఎడిషన్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. స్టేడియం స్పెషల్ ఏంటో తెలుసా?
ఒలింపిక్స్‌లో క్రికెట్.. స్టేడియం స్పెషల్ ఏంటో తెలుసా?