AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gizmore Smartwatch: గిజ్‌మోర్ వన్స్‌మోర్.. చవకైనా ధరలో మరో స్మార్ట్ వాచ్ లాంచ్.. ఫీచర్లు మాత్రం టాప్ క్లాస్..

జనాలు కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కూడిన వాచ్ లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గిజ్ మోర్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ మన దేశంలో లాంచ్ అయ్యింది. దాని పేరు గిజ్ మోర్ ప్రైమ్. ఇది జింక్ అల్లాయ్ మెటల్ బాడీ తో పాటు లెదర్ స్ట్రాప్ తో వస్తోంది.

Gizmore Smartwatch: గిజ్‌మోర్ వన్స్‌మోర్.. చవకైనా ధరలో మరో స్మార్ట్ వాచ్ లాంచ్.. ఫీచర్లు మాత్రం టాప్ క్లాస్..
Gizmore Prime Smartwatch
Madhu
|

Updated on: Jun 29, 2023 | 5:30 PM

Share

ట్రెండీ గ్యాడ్జెట్ అంటే అది స్మార్ట్ వాచ్ అనే చెప్పాలి. అందులో ఉంటున్న స్మార్ట్ ఫీచర్లు జనాలకు బాగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా హెల్త్, ఫిట్ నెస్ ఫీచర్ల కోసం అధికంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా పోటీ పడి తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఫలితంగా జనాలు కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కూడిన వాచ్ లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గిజ్ మోర్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ మన దేశంలో లాంచ్ అయ్యింది. దాని పేరు గిజ్ మోర్ ప్రైమ్. ఇది జింక్ అల్లాయ్ మెటల్ బాడీ తో పాటు లెదర్ స్ట్రాప్ తో వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గిజ్ మోర్ ప్రైమ్ స్మార్ట్ వాచ్, ధర లభ్యత..

గిజ్ మోర్ ప్రైమ్ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం ప్రారంభ ఆఫర్ కింద రూ.1,799కే లభిస్తోంది. ఆ తర్వాత దీనిని రూ. 2,499కి విక్రయించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. జూన్ 29 నుంచి గిజ్ మోర్ అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో కూడా విక్రయాలు జరగుతాయి. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్రౌన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

గిజ్ మోర్ ప్రైమ్ స్మార్ట్ వాచ్ సాధారణ ఫీచర్లు ఇవే..

గిజ్ మోర్ ప్రైమ్ స్మార్ట్ వాచ్ 1.45 అంగుళాల డిస్ ప్లే ను కలిగి ఉంది. అమోల్డ్ స్క్రీన్ ఉంటుంది. 2.5డీ కర్వ్ డ్ డిస్ ప్లే 412×412 రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది పలు రకాల వాచ్ ఫేసెస్ ను కలిగి ఉంటుంది. స్ల్పిట్ స్క్రీన్ ఫంక్షన్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు సులభంగా సెట్టింగ్స్, యాప్స్, ఫీచర్లను వినియోగించుకోవచ్చు. ఈ వాచ్ రౌండ్ డైల్, యాక్టివ్ క్రౌన్ పొజిషన్డ్ సైడ్ బటన్స్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

గిజ్ మోర్ ప్రైమ్ స్మార్ట్ వాచ్ హెల్త్ ఫీచర్లు ఇవే..

గిజ్ మోర్ ప్రైమ్ స్మార్ట్ వాచ్ 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దీనిలో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఆక్సిజన్ మోనిటర్, 24/7 హార్ట్ రేట్ మోనిటర్, కేలరీ కౌంటర్, స్లీప్ మోనిటర్, స్ట్రెస్ మోనిటర్, బ్రీథింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే ఈ వాచ్ ను కో ఫిట్ యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు.

గిజ్ మోర్ ప్రైమ్ స్మార్ట్ వాచ్ అదనపు ఫీచర్లు ఇవే..

అంతేకాక ఈ స్మార్ట్ వాచ్ లో ఇన్ బిల్ట్ కాలిక్యులేటర్, టైమర్, స్టాప్ వాచ్, వెదర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఐపీ67 సర్టిఫికెట్ తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. గిజ్ మోర్ ప్రైమ్ స్మార్ట్ వాచ్ హిందీ ల్యాంగ్వేజీ సపోర్టుతో వస్తోంది. అంతేకాక బ్లూటూత్ కాలింగ్, ఇన్ బిల్ట్ స్పీకర్, మైక్రోఫోన్ ఉంటాయి. అలెక్సా, సిరి వంటి వర్చువల్ అసిస్టెంట్స్ కి కూడా మద్ధతు ఇస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us