- Telugu News Photo Gallery Technology photos Redmi launching new smart watch Redmi Watch 3 Active features details
Redmi Watch 3 Active: రెడ్‌మీ నుంచి స్మార్ట్ వాచ్ వచ్చేస్తోంది.. ఏమన్న ఫీచర్సా అసలు.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ తాజాగా స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగానే రెడ్‌మీ వాచ్ 3 యాక్టివ్ పేరుతో వాచ్‌ను ప్రకటించింది. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jun 29, 2023 | 7:13 PM

స్మార్ట్‌ఫోన్‌లకు పెట్టింది పేరైన రెడ్‌మీ తాజాగా స్మార్ట్ వాచ్‌లను సైతం తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగానే రెడ్‌మీ వాచ్ 3 యాక్టివ్ పేరుతో మార్కెట్లోకి ఓ వాచ్‌ను తీసుకొచ్చింది.

ఈ వాచ్‌ను తాజాగా గ్లోబల్‌గా ఆవిష్కరించిన రెడ్‌మీ ధర, లాంచ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. ఇక ఈ స్మార్ట్ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్స్‌ను అందించింది రెడ్‌మీ.

రెడ్‌మీ వాచ్ 3 యాక్టివ్ స్మార్ట్‌వాచ్ ఫీచర్ల విషయానికొస్తే.. 240×280 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో కూడిన 1.83 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ వాచ్‌లో బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ ఇచ్చారు.

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ద్వారా నేరుగా వాచ్‌లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందులో రన్నింగ్, ట్రెడ్‌మిల్, అవుట్‌డోర్ సైక్లింగ్, వాకింగ్, ట్రెక్కింగ్, లాంటి స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు.

ఈ స్మార్ట్‌వాచ్‌లో 289 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 రోజుల పాటు పనిచేస్తుంది. అంతేకాకుండా దుమ్ము, నీరు నుంచి ప్రొటెక్షన్ కోసం 5ATM రేటింగ్ ఇచ్చారు.




