Amazfit Pop 3R: అమేజింగ్‌ ఫీచర్లతో అమేజ్‌ఫిట్‌ కొత్త స్మార్ట్‌ వాచ్‌.. ఏకంగా పన్నెండు రోజుల బ్యాటరీ లైఫ్‌..

ఈ వాచ్ పేరు అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఆర్‌. ఇటీవల లాంచ్‌ చేసిన పాప్‌ 3ఎస్‌ వాచ్‌కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా దీనిని అమేజ్‌ఫిట్‌ మన దేశ మార్కెట్లో విడుదల చేసింది. ప్రధాన ఆకర్షణ దీనిలోని బ్యాటరీ. ఫుల్‌ చార్జి చేస్తే 12 రోజుల పాటు నాన్‌ స్టాప్‌గా పనిచేస్తుంది.

Amazfit Pop 3R: అమేజింగ్‌ ఫీచర్లతో అమేజ్‌ఫిట్‌ కొత్త స్మార్ట్‌ వాచ్‌.. ఏకంగా పన్నెండు రోజుల బ్యాటరీ లైఫ్‌..
Amazfit Pop 3r Smartwatch
Follow us

|

Updated on: Jun 27, 2023 | 4:00 PM

స్మార్ట్‌ వాచ్‌ మార్కె‍ట్లో కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వినియోగదారుల అవసరాల ఆధారంగా ఉత్తమమైన ఉత్పత్తులను లాంచ్‌ చేసేందుకు ఆయా కంపెనీలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో చవకైన ధరలో స్మార్ట్‌ ఫోన్లు అందిస్తున్న వాటిల్లో బోట్‌, ఫైర్‌ బోల్ట్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. వాటికి దీటుగా ఇప్పుడు అమేజ్‌ఫిట్‌ కూడా వచ్చింది. తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ వాచ్‌ ని లాంచ్‌ చేసింది. దాని పేరు అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఆర్‌. ఇటీవల లాంచ్‌ చేసిన పాప్‌ 3ఎస్‌ వాచ్‌కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా దీనిని అమేజ్‌ఫిట్‌ మన దేశ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రధాన ఆకర్షణ దీనిలోని బ్యాటరీ. ఫుల్‌ చార్జి చేస్తే 12 రోజుల పాటు నాన్‌ స్టాప్‌గా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఆర్‌..స్పెక్స్‌, ఫీచర్లు..

ఈ అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఆర్‌ అనేది క్లాసిక్‌ రౌండ్‌ మెటాలిక్‌ ఛాసిస్‌తో వస్తుంది. దీని మిడ్‌ ఫ్రేమ్‌ లో రెండు స్టీల్‌ బటన్స్‌ ఉంటాయి. ఇది నావిగేషన్‌ కోసం వినియోగించుకోవచ్చు. ఈ వాచ్‌ లో 1.43 అంగుళాల హెచ్‌డీ డిస్‌ ప్లే అమోల్డ్‌ డిస్‌ ప్లే 466 x 466 పిక్సల్స్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. మల్టిపుల్‌ క్లౌడ్‌ ఆధారిత వాచ్‌ పేస్‌ ఆప్షన్లు ఉంటాయి. దీనికి బ్లాక్‌ సిలికాన్‌ స్ట్రాప్‌ లేదా స్టైన్‌ లెస్‌ స్టీల్‌ స్ట్రాప్‌ వస్తుంది. దీనిలోని బ్యాటరీ ఒకసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఏకంగా 12 రోజుల పాటు పనిచేస్తుంది. ఇది ఫుల్‌ చార్జ్‌ అవడానికి 90 నిమిషాలు పడుతుంది. దీనిలో బ్లూటూత్‌ 5.2 ఉంటుంది. బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ సపోర్టు చేస్తుంది ఉంటుంది. డిజిటల్‌ మైక్రోఫోన్‌, స్పీకర్‌ ఉంటుంది. ఫుల్‌ స్క్రీన్‌ డయల్‌ ప్యాడ్‌ ఉంటుంది. ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ ఉంటుంది.

అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఆర్‌‌లోని హెల్త్‌ ఫీచర్లు ఇవి..

ఈ వాచ్‌ పలు రకాల హెల్త్‌, ఫిట్‌నెస్‌ లక్ష్యాలను అధిగమించడానికి సాయపడుతుంది. దీనిలో 100 స్పోర్ట్స్‌ మోడ్లు ఉంటాయి. దీనిలో 24/7 హార్ట్‌ రేట్‌ మోనిటరింగ్‌ ఉంటుంది. స్లీప్‌ ట్రాకింగ్‌, ఆక్సిజన్‌ లెవల్‌ మోనిటరింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐపీ68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇది, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండింటిలోనూ పనిచేస్తుంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే మ్యూజిక్‌ కంట్రోల్‌, కెమెరా కంట్రోల్‌, ఫైండ్‌ మై ఫోన్‌ ఫీచర్‌, స్టాప్‌ వాచ్‌, అలారం క్లాక్‌, వెదర్‌ ఫోర్‌ కాస్ట్స్‌ వంటివి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఆర్‌ ధర, లభ్యత..

ఈ అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఆర్‌ స్మార్ట్‌ వాచ్‌ ఫ్లిప్‌ కార్ట్‌ లో జూలై 29 నుంచి అధికారికంగా అమ్మకానికి వస్తుంది. సిలికాన్‌ స్ట్రాప్‌తో కూడిన వాచ్‌ ధర రూ. 3,499 కాగా.. స్టైన్‌లెస్‌ స్టీల్‌ స్ట్రాప్‌ అయితే రూ. 3,999కి లభ్యమవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023