Phone Shortcuts: ఫోన్లో ఈ షార్ట్ కట్స్ తెలిస్తే షాక్ అయిపోతారు.. ఒక్క సైడ్ బటన్‌తోనే అవన్నీ చేసేయొచ్చు..

ఐఫోన్‌ లో కూడా లభించిన సూపర్‌ షార్ట్‌ కట్‌ శామ్‌సంగ్‌ ఫోన్లలో లభిస్తుంది. ఫోన్‌ లో సైడ్‌ ఉండే పవర్‌ కీ బటన్‌ రెండు సార్లు నొక్కితే కెమెరా ఓపెన్‌ అవుతుంది. అన్ని ఆండ్రాయిడ్‌లలోనూ ఇదే ఉంటుంది. అయితే శామ్‌సంగ్‌ గేలాక్సీ ఫోన్లలో మాత్రం ఏ యాప్‌ అయినా ఓపెన్‌ చేసేలా అవకాశం ఉంటుంది.

Phone Shortcuts: ఫోన్లో ఈ షార్ట్ కట్స్ తెలిస్తే షాక్ అయిపోతారు.. ఒక్క సైడ్ బటన్‌తోనే అవన్నీ చేసేయొచ్చు..
Samsung Galaxy Phones
Follow us
Madhu

|

Updated on: Jun 27, 2023 | 3:00 PM

ఆండ్రాయిడ్‌ అంటే మొదట గుర్తొచ్చేది శామ్‌సంగ్‌ గేలాక్సీ ఫోన్లు. ఆండ్రాయిడ్‌ వచ్చిన కొత్తలో శామ్‌సంగ్‌ గేలాక్సీ ఫోన్ల ప్రభ మామూలుగా వెలగలేదు. ఒకానొక దశలో దీనికి పోటీ ఇచ్చే మరో కంపెనీ ఆండ్రాయిడ్‌లో లేదంటే అతిశయోక్తి కాదేమో. అంతలా జనాల్లోకి వెళ్లాయి శామ్‌సంగ్‌ గేలాక్సీ ఆండ్రాయిడ్‌ ఫోన్లు. అప్పటి నుంచి తన స్థానాన్ని కాపాడుకునేందుకు శామ్‌సంగ్‌ శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంది. ఎన్ని కొత్త ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్లు వచ్చినా శామ్‌సంగ్‌ తన స్థానాన్ని కాపాడుకుంటూనే వస్తోంది. దానికి ప్రధాన కారణం శామ్‌సంగ్‌ గేలాక్సీ ఫోన్లలోనే ఫీచర్లు అనే చెప్పాలి. అలాగే శామ్‌సంగ్‌లో బేసిక్‌ ఫీచర్లతో అతి తక్కువ ధర నుంచి హై ఎండ్‌ ఫీచర్లతో కూడిన అధిక ధర ఫోన్ల వరకూ అన్ని రకాల బడ్జెట్లలో గేలాక్సీ ఆండ్రాయిడ్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లోని ఫీచర్లను చాలా మంది వినియోగదారులు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. అలాగే శామ్‌సంగ్‌ గేలాక్సీ ఫోన్లలో ఉండే షార్ట్‌ కట్‌ లను కూడా వాడలేకపోతున్నారు. అందుకే శామ్‌ సంగ్‌ గేలాక్సీ ఎస్‌23 అల్ట్రా నుంచి గేలాక్సీ ఏ54 వరకూ అన్ని రకాల శామ్‌సంగ్‌ గేలాక్సీ ఫోన్లలోనూ వాడదగిన షార్ట్‌ కట్ల గురించి మీకు తెలియజేస్తున్నాం. షార్ట్‌ కట్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?వాటిని ఎలా వాడాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సైడ్‌ కీతో ఏ యాప్‌ అయినా ఓపెన్‌..

ఐఫోన్‌ లో కూడా లభించిన సూపర్‌ షార్ట్‌ కట్‌ శామ్‌సంగ్‌ ఫోన్లలో లభిస్తుంది. అదేంటంటే శామ్‌సంగ్‌ గేలాక్సీ ఫోన్‌ లో సైడ్‌ ఉండే పవర్‌ కీ బటన్‌ రెండు సార్లు నొక్కితే కెమెరా ఓపెన్‌ అవుతుంది. అన్ని ఆండ్రాయిడ్‌లలోనూ ఇదే ఉంటుంది. అయితే శామ్‌సంగ్‌ గేలాక్సీ ఫోన్లలో మాత్రం ఏ యాప్‌ అయినా ఓపెన్‌ చేసేలా అవకాశం ఉంటుంది. దాని కోసం మీరు ఫోన్‌ సెట్టింగ్స్‌ లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. దానిలో సైడ్‌ కీ సెట్టింగ్స్‌ అని ఉంటాయి. దానిని ఓపెన్‌ చేస్తే మీకు యాప్‌ లిస్ట్‌ కనిపిస్తుంది. మీరు ఏ యాప్‌ తెరవాలని భావిస్తున్నారో అదే యాప్‌ ని సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకొంటే బిక్స్‌బై(Bixby)ని నిలిపివేయొచ్చు. కానీ ఇది శామ్‌సంగ్‌ వాయిస్‌ ఇంటర్‌ ఫేస్‌ కాబట్టి దీనిని వినియోగించుకోవడం మేలు. మీరు ఫోన్‌ రీస్టార్ట్‌ చేయడానికి, లేదా పవర్‌ ఆఫ్‌ చేయడానికి ఈ బిక్స్‌బై సులభమైన, వేగవంతమైన ఆప్షన్‌.

బిక్స్‌బై షార్ట్‌ కట్‌..

గేలాక్సీ ఫోన్లు వాడే వారు ఈ బిక్స్‌బైని యాక్టివేట్‌ చేసుకోకపోతే ఆ ఫోన్‌ నుంచి మీరు ఎక్కువ ప్రయోజనాలు పొందలేరు. అయితే ఇది గూగుల్‌ అసి‍స్టెంట్‌, లేదా సిరి వంటిది కాదు. అయితే ఇది మీ ఫోన్‌ ని వేగంగా ఆపరేట్‌ చేసేందుకు మాత్రం ఇది ఉపయోగపడుతుంది. మీకు ఏది తెలియకపోయినా అది చేసిపెడుతుంది. వైఫై ఆన్‌ చేయాలన్నా.. సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలన్నా.. హాట్‌స్పాట్‌ యాక్టివేట్‌ చేయాలన్నా ఏదైనా అదే చేసేస్తోంది. అందుకోసం దాని పేరును కూడా మీరు పలకాల్సిన పనిలేదు. కేవలం సైడ్‌ బటన్‌ నొక్కి మీకు అవసరం అయినా దానిని చెబితే చాలు అది చేసిపెడుతుంది.

ఇవి కూడా చదవండి

క్విక్‌ సెట్టింగ్స్‌..

వైఫై, బ్లూటూత్‌ వంటివి త్వరితగతిన ఆన్‌ అండ్‌ ఆఫ్‌ కావాల్సి ఉంటుంది. వాటిని క్విక్‌ సెట్టింగ్స్‌లో పెట్టుకొని అది ఎ‍ప్పుడైనా ఓపెన్‌ చేసుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే క్విక్‌ సెట్టింగ్‌ లలో కిడ్స్‌ మోడ్‌ ను కూడా పెట్టుకోవచ్చు. తద్వారా ఒక్క బటన్‌తో కిడ్స్‌ స్క్రీన్‌ ఎనేబుల్‌ అవుతుంది. అలాగే థియేటర్ మోడ్ వంటి ఫోకస్ మోడ్‌లను కూడా వేగంగా ఆన్‌ చేయొచ్చు. దీనికోసం మీరు ఫోన్లో హోమ్ స్క్రీన్ నుంచి కిందికి స్వైప్ చేయాలి. అప్పుడు నోటిఫికేషన్ బార్ ఓపెన్‌ అవుతుంది. క్విక్‌ సెట్టింగ్‌ బటన్‌ల గ్రిడ్‌ కనబడటానికి మళ్లీ స్వైప్‌ చేయండి. ఆ తర్వాత ఎడమవైపునకు స్వైప్‌ చేసి హైడ్‌ అయిన అన్ని బటన్‌ లను యాడ్‌ చేయడానికి ‘+’ బటన్‌ను నొక్కండి

అవసరం లేని యాప్‌లను దాచేయవచ్చు..

మీ ఫోన్లో పదుల సంఖ్యలో యాప్‌లు ఉంటాయి. వాటిల్లో మీరు తరచూ వినియోగించే యాప్‌లు తక్కువ ఉన్నాయనుకోండి. మిగిలిన యాప్‌ లను హోమ్‌ స్క్రీన్‌పై కనిపించకుండా హైడ్‌ చేయొచ్చు. దీని వల్ల మీకు స్క్రీన్‌ క్లీన్‌గా ఉంటుంది. దీనిని కోసం సెట్టింగ్స్‌ లోకి వెళ్లి హైడ్‌ యాప్స్‌ అండ్‌ హోమ్ స్క్రీన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

వాయిస్‌తో ఫోటోలు తీయవచ్చు..

మీ స్మార్ట్‌ ఫోన్‌తో ఫోటోలు తీసేటప్పుడు అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్య కదిలిపోవడం. దీని వల్ల బ్లర్డ్ ఇమేజ్‌లు వస్తుంటాయి. ఫోన్‌ చేతిలో స్టడీగా పట్టుకున్న కరెక్ట్‌గా బటన్‌ నొక్కే సమయానికి కదలిపోయే సందర్భాలు చాలా చూసి ఉంటాం. అయితే మీరు గేలాక్సీ ఫోన్‌ నుంచి స్క్రీన్‌ ను తాకకుండానే మీరు ఫోటో తీయవచ్చు. మీ వాయిస్‌ కమాండ్‌ ద్వారా ఫోటో వస్తుంది. అందుకోసం మీరు చీజ్‌ లేదా షూట్‌ అని చెబితే చాలు. ఈసెట్టింగ్‌ ని యాక్టివేట్‌ చేయడానికి కెమెరాను ఓపెన్‌ చేసి దానిలో సెట్టింగ్స్‌ లోకి వెళ్లి, షూటింగ్‌ మెథడ్స్‌ ఓపెన్‌ చేయాలి. దానిలో వాయిస్‌ కమాండ్స్‌ ను యాక్టివేట్‌ చేయండి. ఆ తర్వాత చీజ్‌ లేదా షూట్‌ అనే వాటిలో ఏదో ఒక కమాండ్‌ను ఇచ్చి యాక్టివేట్‌ చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..