Vivo Y36 vs Oppo A78: ఒప్పో ఏ 78కు పోటీగా వివో వై 36.. ధరలోనే కాదు ప్రతి విషయంలోనూ పోటీనే.. వివరాలను తెలుసుకోండి
స్మార్ట్ ఫోన్లు అమెరికా, చైనా తర్వాత భారతదేశంలోనే అధికంగా అమ్ముడవుతున్నాయి. పెరిగిన మార్కెట్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు తమ కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. చైనీస్ టెక్నాలజీ దిగ్గజం వివో జూన్ 20న భారతదేశంలో వివో వై 36ని లాంచ్ చేసింది.
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు అమెరికా, చైనా తర్వాత భారతదేశంలోనే అధికంగా అమ్ముడవుతున్నాయి. పెరిగిన మార్కెట్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు తమ కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. చైనీస్ టెక్నాలజీ దిగ్గజం వివో జూన్ 20న భారతదేశంలో వివో వై 36ని లాంచ్ చేసింది. తాజా వివో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే 8 జీబీ ర్యామ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. వై సిరీస్ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అలాగే ఒప్పో ఏ 78 5జీ ఫోన్‌ను ఈ సంవత్సరం జనవరిలో భారతదేశంలో ప్రారంభించారు. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో 700 ఎస్ఓసీతో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అదేవిధంగా 8 జీబీ + 128 జీబీ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర రూ. 18,999. ఈ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్స్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
వివో వై 36 X ఒప్పో ఏ 78
వివో వై 36
- ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ ద్వారా పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
- వై సిరీస్ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది.
- ఈ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది.
- వివో వై 36 ఫోన్ ధర రూ. 16,999గా ఉంటుంది. అలాగే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది మీటియర్ బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
- వివో వై 36 డ్యూయల్ సిమ్ (నానో) కోసం సపోర్ట్‌ను కలిగి ఉంది. అలాగే ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
- ఈ ఫోన్ ఫన్ టచ్ ఓఎస్ 13తో రన్ అవుతుంది
- ఈ ఫోన్ 6.64 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో కలిగి ఉంది.
- ఈ ఫోన్ 16 ఎంపీ సెల్ఫీకెమెరాతో పని చేస్తుంది.
ఒప్పో ఏ 78 5జీ
- ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ హీలియో 700 ఎస్ఓసీతో రన్ అవుతుంది.
- ఈ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ వస్తుంది. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
- 8 జీబీ+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది.
- ఈ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
- ఒప్పో ఏ 78 డ్యూయల్ సిమ్ (నానో)కి మద్దతునిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌లపై నడుస్తుంది.
- ఒప్పో ఏ 78 5జీ కలర్ ఓఎస్ 13పై రన్ అవుతుంది.
- ఈ ఫోన్ 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో పని చేస్తుంది.
- ఒప్పో ఏ 78 కూడా 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
‘మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..