- Telugu News Photo Gallery Oneplus launching One plus 12 smart phone by the end of this year have a look on features and price
OnePlus 12: వన్‌ప్లస్ నుంచి స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. లుక్, ఫీచర్స్ అదుర్స్ అంతే.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వన్‌ప్లస్ 11కి కొనసాగింపుగా వన్‌ప్లస్ 12ని తీసుకొస్తోంది. ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jun 26, 2023 | 5:05 PM

మొన్నటి వరకు బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోన్న వన్‌ప్లస్ తాజాగా ప్రీమియం స్టార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ 12 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నారు.

వన్‌ప్లస్ 11కి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2కే రిజొల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

డిసెంబర్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రీమియం రేంజ్‌లో తీసుకొస్తున్న ఈ ఫోన్ ధర రూ. 60 వేల వరకు ఉండొచ్చని అంచనా.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 9-సిరీస్ ప్రైమరీ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 64-మెగా పిక్సెల్ ఓమ్ని విజన్ ఓవీ 64బీ పెరిస్కోప్ లెన్స్‌తో కెమెరాను డిజైన్ చేశారు.

వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌లో 150 వాట్స్ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఎహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఈ ఫో విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే ఉండనున్నట్లు సమాచారం.





























