- Telugu News Photo Gallery Spiritual photos Wishes of these zodiac signs will be fulfilled due to auspicious planetary position Telugu astrology
Zodiac Signs: అనుకూలంగా శుభగ్రహాల సంచారం.. వారి మనసులోని కోరికలు నెరవేరడం పక్కా..! మీకు ఎలా ఉందంటే..?
సాధారణంగా శుభగ్రహాల కారణంగా మనసు లోని కోరికలు నెరవేరుతుంటాయి. గ్రహచారం ప్రకారం శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనసులోని కోరికలు ఒకటి రెండు అయినా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. మితిమీరిన కోరికలు, గొంతెమ్మ కోరికలు కాకుండా హేతుబద్ధ మైన కోరికలు నెరవేరే అవకాశం ఉందా లేదా అన్నది గ్రహాల స్థితిగతులను బట్టి కొంతవరకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Updated on: Jun 26, 2023 | 3:11 PM

తుల: బుధ-శుక్ర, కుజుడు కలయిక వల్ల తుల రాశి వారికి అనుకోని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. సంపదను పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో పాటు వృత్తి జీవితంలో కూడా మార్పు వస్తుంది.

మేషం: ఈ రాశి వారికి గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని ఒకటి రెండు కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. సాధార ణంగా ఈ రాశి వారికి అధికారం చేపట్టాలనే కోరిక అధికంగా ఉంటుంది. ఈ కోరిక ఈ ఏడాది అక్టోబర్ తరువాత నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనసులోని కోరిక నెరవేరడానికి ఆటంకాలు ఎదురవుతుంటాయి. కొద్ది ప్రయత్నంతో ప్రస్తుతం ప్రమోషన్ సంపాదించే అవకాశం ఉంది.

వృషభం: ప్రస్తుతం ఈ రాశి వారికి బుధ, రవి గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక, అధికార సంబంధమైన కోరికలు ఒకటి రెండు సంతృప్తికరంగా నెరవేరే అవకాశం ఉంది. అక్టోబర్ 24 తర్వాత ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. కొద్ది ప్రయత్నంతో జూలై ఒకటవ తేదీ నుంచి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడటం జరుగు తుంది. ఆదాయం పెరగటం, అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి చోటు చేసుకుంటాయి.

మిథునం: ఈ రాశి వారికి గురువు, బుధుడు, శుక్రుడు, రాహువు అనుకూలంగా ఉన్నందువల్ల, కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలలో ఎక్కువ భాగం నెరవేరడం జరుగుతుంది. ఈ రాశి వారికి జూలై 1వ తేదీ నుంచి గృహ, వాహన సౌకర్యా లకు సంబంధించిన కోరికలు నెరవేరే సూచనలు న్నాయి. ఆరోగ్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయి. ఉన్నత విద్య, విదేశీయానం వంటి కోరికలు తీరే అవకాశం కూడా ఉంది.

కర్కాటకం: ఈ రాశి వారికి ప్రస్తుతం కుజ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరడం జరుగుతుంది. అష్టమ శని కారణంగా ఏ కోరిక నెరవేరాలన్నా తప్పనిసరిగా ప్రయత్నం, శ్రమ అవసరం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు, స్త్రీ సాంగత్యం, వివాహం తదితర కోరికలు అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య నెరవేరే సూచనలు ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది.

సింహం: గురువు, బుధ గ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ రాశి వారి కోరికలు కొన్ని అతి త్వరలో నెరవేరే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేర డానికి ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్ లేదా అధికారం చేపట్టడం జరుగు తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు జూలై నెలలో విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి. సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి చిన్న పనికి గట్టి ప్రయత్నం అవసరం అవుతుంది. సంతానానికి సంబంధించిన కోరిక కూడా నెరవేరుతుంది.

కన్య: ఈ రాశి వారికి ప్రస్తుతం బుధ, శుక్ర, రవి, రాహు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మనసులోని కోరికలు నెరవేరడానికి ఇంత కన్నా మంచి సమయం మరొకటి ఉండకపోవచ్చు. ఉద్యోగం రావడం, ఉద్యోగంలో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం వంటివి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో తప్ప కుండా నెరవేరటం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

తుల: గురు బుధ శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పెళ్లి, ఆర్థిక స్థితి, స్త్రీ సాంగత్యం వంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఈ కోరికలు అప్రయత్నంగా నెరవేరడం జరుగు తుంది. అక్టోబర్ లోగా పెళ్లి ప్రయత్నాలు సఫలం కావడం, ఆశించిన స్థాయిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటివి జరుగుతాయి. దగ్గర బంధువులు, స్నేహితుల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగటం కూడా జరుగుతుంది.

వృశ్చికం: శుక్ర, కుజ, రాహు గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల నవంబర్ నెలలోగా ఆర్థిక సమస్య లకు పరిష్కారం లభిస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారటం, ఆదాయం పెరగటం, పెళ్లి జరగటం వంటి కోరికలు నెరవేరే సూచనలున్నాయి. అర్ధాష్టమ శని కారణంగా గట్టి ప్రయత్నం చేయ వలసి ఉంటుంది. ముఖ్యమైన పనుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఉద్యోగం లేని వారు, ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు రెండు నెలల్లో శుభవార్తలు వినటానికి అవకాశం ఉంది.

ధనుస్సు: గురువు బుధుడు రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల సంబంధమైన కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. వృత్తిపరంగా గుర్తింపు పొందడం, డిమాండ్ పెరగటం, తద్వారా ఆదాయం వృద్ధి చెందటం వంటి మనసులోని కోరికలు కొద్ది ప్రయత్నంతో సఫలం కావడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా ఆశించిన స్థాయిలో పురోగతి చెందే అవకాశం ఉంది. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి.

మకరం: శనీశ్వరుడు శుక్రుడు రవి గ్రహాలు అనుకూల స్థానాలలో సంచరిస్తున్నందువల్ల ఆర్థిక సంబంధ మైన కోరికలు నెరవేరడం జరుగుతుంది. ఆర్థిక పరంగా స్థిరత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మనసులో కోరుకున్న విధంగా ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. నవంబర్ లోగా ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీయానానికి మాత్రం ప్రస్తుతానికి అవకాశం లేదు.

కుంభం: ప్రస్తుతానికి ఈ రాశి వారికి బుధ గ్రహం మాత్రం అనుకూలంగా ఉన్నందువల్ల తీర్థ యాత్రలు, విహార యాత్రలకు సంబంధించిన కోరికలు అతి త్వరలో నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యం, ఆదాయానికి సంబంధించిన కోరికలు నెరవేర డానికి డిసెంబర్ దాకా సమయం పట్టే అవకాశం ఉంది. మంచి ఉద్యోగంలోకి మారాలనే కోరిక అక్టోబర్ తర్వాత నెరవేరే అవకాశం ఉంది. సామాజికంగా గుర్తింపు, గౌరవ మర్యాదలు లభించడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి.

మీనం: గురు శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక పురోగతి, ముఖ్యమైన ఆలయాల సందర్శన వంటి కోరికలు అక్టోబర్ లోపల చేయటం జరుగుతుంది. కోరుకున్న విధంగా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. విదేశీయానం, ఉద్యోగంలో మార్పు, కొత్త ఉద్యోగం వంటి కోరికలు డిసెంబర్ తర్వాత నెరవేరే సూచనలు ఉన్నాయి. పెళ్లి, ప్రేమ, స్త్రీ సాంగత్యం తదితర కోరికలు నెరవేరడానికి కూడా ఈ ఏడాది చివరి వరకు ఆగవలసి ఉంటుంది.



