- Telugu News Photo Gallery Spiritual photos Tuesday Astro Tips :do these 5 things necessarily on tuesday to pleased Lord Hanuman and ketu
Tuesday Puja Tips: మంగళవారం ఈ ఐదు పరిహారాలు చేసి చూడండి.. హనుమంతుడు, కుజుడు అనుగ్రహం మీ సొంతం..
సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉంది. మంగళవారం రామ భక్త హనుమాన్ కు అంకితం చేయబడిన రోజు. అంతేకాదు అంగారకుడిని కూడా మంగళవారం పూజిస్తారు. ఇద్దరూ మనుషులు చేసే తప్పు ఒప్పులకు అనుగుణంగా శిక్షలను రక్షణ ఇస్తారని నమ్మకం.
Updated on: Jun 27, 2023 | 9:08 AM

మనిషి చేసే కర్మలను అనుసరించి జీవితంలో ఫలితాలను అనుభవిస్తారు. మంచి, చెడు పనులను అనుసరించి వ్యక్తి జీవితం నడుస్తుంది. మేషరాశికి అధిపతి అయిన కుజుడు కోపంతో ఉంటే ఆ వ్యక్తికి చెడు రోజులు ప్రారంభం అవుతాయని విశ్వాసం. అదే సమయంలో హనుమంతుడికి కోపం వస్తే చెడు పనులు చేసేవారు, నిజాయితీ లేనివారు ఇబ్బందులకు గురవుతారు. ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలంటే.. హనుమంతుడిని, కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో బజరంగబలి అనుగ్రహం కోసం చేయాల్సిన ఐదు ముఖ్యమైన పూజ, నియమాల గురించి తెలుసుకుందాం..

మంగళ సోత్రాన్ని పఠించండి: ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల భారంలో ఉండి.. ఇబ్బంది పడుతున్నా.. చేసిన అప్పులు తీర్చలేకపోతున్నా.. మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్త్రోత్రాన్ని పఠించాలి. వీలైతే మంగళవారం కనీసం 7 లేదా 9 లేదా 11 హనుమాన్ చాలీసా పుస్తకాలను విరాళంగా ఇవ్వండి.

సాయంత్రం వేళ సంధ్యా సమయంలో ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించాలి. ఇంటి నుంచి పిండితో చేసిన దీపాన్ని ఆలయానికి తీసుకెళ్లి.. పిండి దీపంలో నువ్వుల నూనె, ఎర్రటి ఒత్తిని వేసి దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దారిద్య్రం తొలగి ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి.

భజరంగ బలి అందరి కష్టాలను తొలగిస్తాడు. ప్రతి మంగళవారం నిర్మలమైన హృదయంతో హనుమంతుడిని పూజించే భక్తులకు కష్టాలు తొలగిపోతాయి. మంగళవారం సాయంత్రం నూనెలో సింధూరం కలిపి హనుమంతుడి విగ్రహాన్ని అలంకరించండి. అయితే ఇలా పురుషులు మాత్రమే చేయాలి. ఎందుకంటే స్త్రీలు హనుమంతుని విగ్రహాన్ని తాకడం నిషేధం.

ప్రతి మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సుందరకాండ పఠించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ప్రతి మంగళవారం సుందరకాండ పఠించిన తర్వాత బూందీని ప్రసాదంగా పంచండి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.





























