బాస్‌..నీ టైమ్‌ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

బాస్‌..నీ టైమ్‌ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Phani CH

|

Updated on: Sep 15, 2023 | 8:42 PM

సోషల్‌ మీడియాలో అనేకమంది రకరకాల స్టంట్స్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాణాలమీదకు కూడా తెచ్చుకుంటారు. కేవలం సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవడం కోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇందులో ఓ వ్యక్తి ఎత్తయిన కొండపైనుంచి దూకేసాడు. అది చూసి అక్కడున్న జనం భయంతో కేకలు వేశారు. అయితే అది అతను చేసిన స్టంట్‌ అని తెలిసి అవాక్కయ్యారు.

సోషల్‌ మీడియాలో అనేకమంది రకరకాల స్టంట్స్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాణాలమీదకు కూడా తెచ్చుకుంటారు. కేవలం సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవడం కోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇందులో ఓ వ్యక్తి ఎత్తయిన కొండపైనుంచి దూకేసాడు. అది చూసి అక్కడున్న జనం భయంతో కేకలు వేశారు. అయితే అది అతను చేసిన స్టంట్‌ అని తెలిసి అవాక్కయ్యారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి.. ఓ ఎత్తైన కొండపై నుండి దూకేశాడు. అయితే, పారాచూట్‌ ధరించి ఉన్నాడు.. కానీ కొంత సమయం వరకు అది తెరుచుకోలేదు. అత్యంత ఎత్తునుంచి దూకడంతో అతను పల్టీలు కొడుతూ కిందకు పడిపోతున్నాడు. అదృష్టవశాత్తు చివరి క్షణంలో అతని పారాచూట్ తెరుచుకుంది. దాంతో అతను సేఫ్‌గా బయటపడ్డాడు. అతని స్టంట్‌ను గుర్తించని జనాలు.. మొదట షాక్ అయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యలో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు

Allu Arjun: అభిమాని చివరి కోరిక తీర్చేందుకు బయలుదేరిన అల్లు అర్జున్‌ అంతలోనే !!

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల తిరగకుండానే ఆనందం ఆవిరైపోయింది

గుడ్‌న్యూస్‌.. మరో 75 లక్షలమందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ !!

కోనసీమోళ్ల నిశ్చితార్థం.. అదిరిందిగా.. మాములుగా లేదంటున్న అతిథులు