అయోధ్యలో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు

అయోధ్యలో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు

Phani CH

|

Updated on: Sep 15, 2023 | 8:41 PM

అయోధ్యలోని రామ మందిర స్థలంలో పురాతన ఆలయ అవశేషాలు బయల్పడ్డాయి. మందిర నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడినట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. వీటిలో ప్రాచీన దేవాలయ అవశేషాలతోపాటు పలు దేవతా విగ్రహాలు, స్తంభాల అవశేషాలు ఉన్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు. వీటిలో అనేక శిల్పాలు, పురాతన ఆలయ స్తంభాలు ఉన్నాయి.

అయోధ్యలోని రామ మందిర స్థలంలో పురాతన ఆలయ అవశేషాలు బయల్పడ్డాయి. మందిర నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడినట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. వీటిలో ప్రాచీన దేవాలయ అవశేషాలతోపాటు పలు దేవతా విగ్రహాలు, స్తంభాల అవశేషాలు ఉన్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు. వీటిలో అనేక శిల్పాలు, పురాతన ఆలయ స్తంభాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని రామ మందిర నిర్మాణ ప్రదేశంలోని ఓ తాత్కాలిక షెడ్డులో భద్రపరిచారు. ఇవన్నీ అయోధ్యలోని పురాతన రామాలయానికి సంబంధించినవేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సీనియర్ స్వామీజీల ప్రకారం.. రామమందిర ప్రారంభోత్సవం జనవరి మూడో వారంలో ఉండే అవకాశం ఉందని మీడియా నివేదికలు తెలిపాయి. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో జరిగే రామమందిర ప్రారంభోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. అయితే దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆమోదం రావాల్సి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: అభిమాని చివరి కోరిక తీర్చేందుకు బయలుదేరిన అల్లు అర్జున్‌ అంతలోనే !!

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల తిరగకుండానే ఆనందం ఆవిరైపోయింది

గుడ్‌న్యూస్‌.. మరో 75 లక్షలమందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ !!

కోనసీమోళ్ల నిశ్చితార్థం.. అదిరిందిగా.. మాములుగా లేదంటున్న అతిథులు

ముంబై కుర్రాళ్ల స్టైలే వేరు !! ఆడీ కారులో వచ్చి ఛాయ్‌ అమ్ముతున్నారు..