కోనసీమోళ్ల నిశ్చితార్థం.. అదిరిందిగా.. మాములుగా లేదంటున్న అతిథులు
గోదారిజిల్లాల్లో నిశ్చితార్ధాల్లో అబ్బాయి తరపువాళ్ళు అమ్మాయి తరపు వాళ్లకు స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకెళ్లడం అనవాయితీ…. అయితే సాధరణంగా ఎంత పెద్ద మొత్తంలో స్వీట్స్ తీసుకెళ్లినా ఒకే స్వీట్స్ షాపులో ఈ స్వీట్స్ అన్ని తయారుచేయించి తీసుకెళుతుంటారు. కానీ యానంలో జరిగిన కోనసీమకు చెందిన అబ్బాయికి.. యానం అమ్మాయికి జరిగిన ఎంగెజ్ మెంట్ ఫంక్షన్ లో అబ్బాయి తరపు బంధువులు అమ్మాయి తరపు బంధువులకు ఇచ్చిన స్వీట్స్ చాలా ఎట్రాక్షన్ గా నిలిచాయి.
గోదారిజిల్లాల్లో నిశ్చితార్ధాల్లో అబ్బాయి తరపువాళ్ళు అమ్మాయి తరపు వాళ్లకు స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకెళ్లడం అనవాయితీ…. అయితే సాధరణంగా ఎంత పెద్ద మొత్తంలో స్వీట్స్ తీసుకెళ్లినా ఒకే స్వీట్స్ షాపులో ఈ స్వీట్స్ అన్ని తయారుచేయించి తీసుకెళుతుంటారు. కానీ యానంలో జరిగిన కోనసీమకు చెందిన అబ్బాయికి.. యానం అమ్మాయికి జరిగిన ఎంగెజ్ మెంట్ ఫంక్షన్ లో అబ్బాయి తరపు బంధువులు అమ్మాయి తరపు బంధువులకు ఇచ్చిన స్వీట్స్ చాలా ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయాప్రాంతాల్లో ఫేమస్ అయిన దాదాపు అన్ని రకాల స్వీట్స్ తీసుకెళ్లి అందరిని ఆశ్చర్య పరిచారు. కోనసీమ ఆత్మీయం అంటే ఏంటో స్వీట్స్ రూపంలో చూపించారు. మొత్తం 28 రకాల స్వీట్స్ తో పాటు.. డజన్ల కొద్ది ఫ్రూట్స్, పెద్ద పటిక బెల్లం అచ్చు తీసుకెళ్లారు. స్వీట్స్ విషయానికోస్తే అటు శ్రీకాకుళం సోంపేట ఉటంకీ దగ్గర నుంచి ఇటు నెల్లూరు మలై కాజా వరకు అన్ని జిల్లాలనుంచి ఫేమస్ స్వీట్స్ తీసుకొచ్చారు. అందులో మూడు ఫేమస్ టెంపుల్ ప్రసాదాలు కూడా ఉన్నాయి.. తిరుమల శ్రీవారి లడ్డూ, బెజవాడ దుర్గమ్మలడ్డూ, అన్నవరం ప్రసాదం. అంతేకాదు, మూడు రకాల పాపులర్ పాలకోవాలు.. కోనసీమ కోవా, మార్టేరు కోవా, పెద్దాపురం పాలకోవా. అంతేనా.. నాలుగు రకాల కాజాలు.. కాకినాడ గొట్టం కాజా, తాపేశ్వరం మడత కాజా, నెల్లూరు మలై కాజా, విజయనగరం గరివిడి కాజా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముంబై కుర్రాళ్ల స్టైలే వేరు !! ఆడీ కారులో వచ్చి ఛాయ్ అమ్ముతున్నారు..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

