ముంబై కుర్రాళ్ల స్టైలే వేరు !! ఆడీ కారులో వచ్చి ఛాయ్ అమ్ముతున్నారు..
టీ అమ్మి లక్షలు సంపాదించిన వాళ్లను చూసుంటాం. లక్షాధికారులు తిరిగే ఆడీ కారులో టీ అమ్ముతున్న వైనాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ చిత్రం చూడాలంటే.. ముంబయిలోని లోఖండ్‌వాలా బ్యాక్‌రోడ్‌లో రెండు చక్కర్లు కొట్టాలి. అక్కడ దారి పక్కన ఓ తెల్లరంగు ఆడీ కారు కనిపిస్తుంది. దాని చుట్టూ టీ లవర్స్ మూగి ఉంటారు. అందరి చేతుల్లో టీ కప్పులు ఉంటాయి. తళుక్కుమని మెరిసిపోతున్న కారు వంక కన్నార్పకుండా చూస్తూ.. తేనీటిని ఆస్వాదిస్తుంటారు.
టీ అమ్మి లక్షలు సంపాదించిన వాళ్లను చూసుంటాం. లక్షాధికారులు తిరిగే ఆడీ కారులో టీ అమ్ముతున్న వైనాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ చిత్రం చూడాలంటే.. ముంబయిలోని లోఖండ్‌వాలా బ్యాక్‌రోడ్‌లో రెండు చక్కర్లు కొట్టాలి. అక్కడ దారి పక్కన ఓ తెల్లరంగు ఆడీ కారు కనిపిస్తుంది. దాని చుట్టూ టీ లవర్స్ మూగి ఉంటారు. అందరి చేతుల్లో టీ కప్పులు ఉంటాయి. తళుక్కుమని మెరిసిపోతున్న కారు వంక కన్నార్పకుండా చూస్తూ.. తేనీటిని ఆస్వాదిస్తుంటారు. ఆడీ కారులో తయారుచేసిన తేనీరు తాగుతున్నామన్న గర్వం ఒకరిద్దరిలో స్పష్టంగా కనిపిస్తుంది కూడా! ఈ కారు యజమానులు మను శర్మ, అమిత్ కశ్యప్‌లో మాత్రం గర్వం అణువంతైనా కనిపించదు. ఉదయాన్నే ఇద్దరూ మెరుపు వేగంతో లోఖండ్‌వాలాకు వస్తారు. వచ్చీరాగానే డిక్కీ తెరిచి సరంజామా అంతా బయట సర్దుకుంటారు. క్షణాల మీద చక్కటి, చిక్కటి టీ తయారుచేసి ఫ్లాస్క్‌లో పోసి సిద్ధంగా ఉంచుతారు. అప్పటికే పాతిక మందికిపైగా టీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. టీ టేస్ట్ చేసిన తర్వాత ఆ పాతికలో కనీసం పదిమంది అప్పటికప్పుడు ఇంకో టీ ఆర్డర్ ఇస్తారు. ఇలా రాత్రి వరకు టీ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ‘ఓడీ టీ- ఆన్ రోడ్ టీ’ పేరుతో ఆడీని చాయ్ అడ్డాగా మార్చేశారు. ఈ వింత టీ స్టాల్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
C-295 Aircraft: భారత వాయుసేనలోకి మరో బ్రాహ్మాస్త్రం !!
వావ్ !! వాటే క్రియేటివిటీ.. ఆరవై ఏళ్ల వయసులో అద్భుత సృష్టి
పిల్లలకు ఇంట్లో కమ్మగా వండి పెట్టండి… కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
తలకు సవరం.. భార్య డ్రెస్ వేసి అమ్మాయిలా మారాడు.. చివరకు ??
Ram Charan-Upasasana: మ్యాచింగ్ దుస్తుల్లో అదరగొట్టిన రామ్ చరణ్, ఉపాసన