Scrub Typhus: దేశంలో మరో కొత్త జ్వరం ఎంట్రీ.. ఒకరు మృతి

Scrub Typhus: దేశంలో మరో కొత్త జ్వరం ఎంట్రీ.. ఒకరు మృతి

Phani CH

|

Updated on: Sep 15, 2023 | 8:50 PM

దేశంలో కొత్త జ్వరం ఎంట్రీ ఇచ్చింది. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇవి సరిపోవు అన్నట్లు స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం వచ్చింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన గవ్వల మధు అనే 20 ఏళ్ల యువకుడు సెప్టెంబర్‌ 14న ఈ వ్యాధితో మృతి చెందడం జిల్లాలో కలకలం రేపింది. ఇలాంటి వ్యాధితో ఒకరు మరణించడం జిల్లాలో ఇదే తొలిసారి.

దేశంలో కొత్త జ్వరం ఎంట్రీ ఇచ్చింది. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇవి సరిపోవు అన్నట్లు స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం వచ్చింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన గవ్వల మధు అనే 20 ఏళ్ల యువకుడు సెప్టెంబర్‌ 14న ఈ వ్యాధితో మృతి చెందడం జిల్లాలో కలకలం రేపింది. ఇలాంటి వ్యాధితో ఒకరు మరణించడం జిల్లాలో ఇదే తొలిసారి. 15 రోజుల క్రితం మధు జ్వరం బారినపడడంతో ధర్మవరం, అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. ఫలితం లేకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆగస్టు 31న చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబరు 14న ప్రాణాలు విడిచాడు. మధు స్క్రబ్ టైపస్ వ్యాధితోనే మృతి చెందినట్టు ప్రచారం జరగడంతో అప్రమత్తమైన జిల్లా వైద్య అధికారులు వెంటనే మధు స్వగ్రామమైన పోతుకుంటకు ప్రత్యేక బృందాన్ని పంపారు. ఆసుపత్రి రికార్డుల్లో మధు స్క్రబ్ టైపస్‌తోనే మృతి చెందినట్టు ఉండడాన్ని ఈ బృందం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. ఇది ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని, కీటకం కుట్టడం ద్వారా మనిషికి సోకుతుందని తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో కీటక నివారిణి స్ప్రే చేశారు. మధు కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచారు. డెంగ్యూ మాదిరిగానే.. స్క్రబ్ టైఫస్​తో బాధపడే రోగి శరీరంపై దద్దుర్లు వస్తాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్‌-1.. నాలుగోసారి కక్ష్య పెంపు విజయవంతం

కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే రేఖాంశంపై 8 శివాలయాలు

రన్‌వేపై జారి పడ్డ విశాఖ-ముంబై విమానం.. చెలరేగిన మంటలు

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!

మన విక్రమ్ ఫోటో షూట్ చేసిన దక్షిణ కొరియా !! ట్విట్టర్‌లో షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం