పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!

Phani CH

|

Updated on: Sep 15, 2023 | 8:44 PM

నల్గొండ జిల్లా దామరచర్లలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కారు అద్దం పగులగొట్టి క్షణాల్లో 5లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బు కారులో ఉంచి.. భోజనం చేయటానికి రెస్టారెంట్‌ లోపలికి వెళ్లాడు. అంతే కారు అద్దం బ్రేక్ చేసి డబ్బుతో పరారయ్యారు దొంగలు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం అమ్మేశాడు.

నల్గొండ జిల్లా దామరచర్లలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కారు అద్దం పగులగొట్టి క్షణాల్లో 5లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బు కారులో ఉంచి.. భోజనం చేయటానికి రెస్టారెంట్‌ లోపలికి వెళ్లాడు. అంతే కారు అద్దం బ్రేక్ చేసి డబ్బుతో పరారయ్యారు దొంగలు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం అమ్మేశాడు. మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొని అక్కడి నుంచి తన మిత్రులతో కలిసి కారులో బయల్దేరారు. 5 లక్షల రూపాయల క్యాష్‌ ఉన్న బ్యాగును కారులోనే పెట్టి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేయటానికి వెళ్లారు. వారి కారును ఫాలో అవుతూ.. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు దుండగులు క్షణాల వ్యవధిలోనే డబ్బును ఎత్తుకెళ్లిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన విక్రమ్ ఫోటో షూట్ చేసిన దక్షిణ కొరియా !! ట్విట్టర్‌లో షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం

బాస్‌..నీ టైమ్‌ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

అయోధ్యలో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు

Allu Arjun: అభిమాని చివరి కోరిక తీర్చేందుకు బయలుదేరిన అల్లు అర్జున్‌ అంతలోనే !!

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల తిరగకుండానే ఆనందం ఆవిరైపోయింది