Madras High Court: మద్రాస్ హై కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా శ్రీ శ్రీ కూతురు మాలా నియామకం..
చంద్రబాబు అరెస్ట్ అన్యాయం, అక్రమం అంటున్న టీడీపీ.. ఓవైపు న్యాయపోరాటం, మరోవైపు నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఇంకోవైపు జాతీయస్థాయిలో మద్ధతు కూడగట్టే పనిలో పడ్డారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించింది టీడీపీ. ఒప్పందం జరిగిన దగ్గర నుంచి అన్ని విషయాలను అందులో ఉంచింది. దీనిద్వారా ఈ స్కీమ్‌లో అసలు నిజాలు ప్రపంచానికి తెలుస్తాయంటోంది టీడీపీ.
20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం గురించి బయట ప్రపంచానికి పెద్దగా సమాచారం లేదు. వాళ్లంతా ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారని తెలుసుకోవాలని పలువురికి ఆసక్తి ఉన్నా వాళ్ళ వివరాలు అంత సులభంగా దొరికేవి కావు . ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ చిన్న కుమార్తె కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం అందరికీ ఆనందాన్ని పంచుతోంది.
శ్రీశ్రీ కూతురును మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఈనెల 13 న ఉత్తర్వులు జారీచేసింది. సెప్టెంబర్ 1 వ తేదీన హై కోర్టు న్యాయమూర్తులకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. వారిలో శ్రీశ్రీ కుమార్తె జస్టిస్ నిడమోలు మాలా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్నారు.
2022 మార్చ్‌లో అదనపు న్యాయమూర్తిగా నియామకం..
జస్టిస్ మాలా 2022 మార్చిలో మద్రాస్ హై కోర్ట్ అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో మద్రాస్ హైకోర్టు కు న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా మాలా, ఎస్.సౌందర్‌ల పేర్లకు అప్పటి రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఆ 2022 మార్చి 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమెతో పాటు అప్పట్లో హై కోర్టు ల అదనపు న్యాయమూర్తులుగా ఎన్నికైన జస్టిస్ ఏఏ నక్కీరన్, జస్టిస్ ఎస్ సుందర్, జస్టిస్ సుందర్‌మోహన్, జస్టిస్ కబాలి కుమారేశ్‌బాబులు కూడా ప్రస్తుతం శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు
శ్రీ శ్రీ నలుగురి సంతానం లో చిన్న కుమార్తె మాలా..
సుప్రసిద్ధ కవి శ్రీరంగం శ్రీనివాస రావు -శ్రీశ్రీ-సరోజా దంపతుల నాలుగో సంతానమైన మాలా మద్రాస్ లా కళాశాల నుంచి న్యాయవాద డిగ్రీ పొందారు. అనంతరం అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేసి 32 సంవత్సరాలుగా మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీసు చేసింది. 2020 నుంచి పుదుచ్చేరి గవర్నమెంట్ ప్లీడర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించింది. మాలా హస్బెండ్ నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. నిడుమోలు రాధారమణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా. ఈ మాలా-రాధారమణ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో పెద్దకుమారుడైన శ్రీనివాస్ జయప్రకాశ్ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తుండడం విశేషం
శ్రీ శ్రీ – సరోజ దంపతులకు ఒక కుమారుడు మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు వెంకట్ శ్రీనివాసరావు కాగా కుమార్తెలు మంజుల శ్రీనివాసరావు, మంగళ శ్రీనివాసరావు, మాల శ్రీనివాసరావులు. వీరిలో చిన్న కూతురు మాల ప్రస్తుతం హై కోర్టు న్యాయమూర్తి గా నియమింప బడడంతో శ్రీ శ్రీ అభిమానులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..