విటమిన్ మాత్రలకు బదులుగా ఇయర్ బడ్స్ మింగిన మహిళ.. వాటిని తొలగించడానికి భర్తకు వారం పని..!

విటమిన్ పిల్ తెరిచిన తర్వాత, ఆమె తన వాటర్ బాటిల్ తీసి ముందుగా నీరు తాగింది. ఆ తర్వాత మాత్ర మింగేసింది. అది తాగిన తర్వాత తన చేతిలో ఏదో తగిలిందని చూసుకుంది..దాంతో ఒక్కసారిగా ఆమెకు షాక్‌ తగిలినంత పనైంది. చేతిలో విటమిన్‌ మాత్ర పట్టుకుని భర్త ఎయిర్‌పాడ్‌ మింగి నీళ్లు తాగినట్లుగా గ్రహించింది.

విటమిన్ మాత్రలకు బదులుగా ఇయర్ బడ్స్ మింగిన మహిళ.. వాటిని తొలగించడానికి భర్తకు వారం పని..!
Airpod
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 15, 2023 | 10:21 PM

ఇటీవల సూపర్ స్మాల్, సొగసైన, హైటెక్ ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఖరీదైన ఇయర్ బడ్స్ కారణంగా ఓ మహిళ ఇబ్బంది పడిన ఘటన చోటుచేసుకుంది. విటమిన్ మాత్ర వేసుకోబోయిన ఓ మహిళ గోలి మందుకు బదులుగా.. నోటిలో ఇయర్ బడ్స్ పెట్టుకుని మింగి నీళ్లు తాగేసింది. దీంతో సదరు మహిళ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. పిల్లలు ఏదో ఆడుకుంటూ ఏది పడితే అది మింగేస్తుంటారు. చింతగింజలు, చిన్న చిన్న నాణేలు వంటివి మింగేసిన ఘటనలు అనేకం చూశాం. పిల్లలు చేసే అల్లరి తల్లిదండ్రులకు పెద్ద సవాల్‌ అనే చెప్పాలి.. కానీ, ఇప్పుడు ఓ మహిళ అలాంటి పనినే చేసింది. విటమిన్ మాత్రలకు బదులు ఇయర్ బడ్స్ మింగి నీళ్లు తాగింది. మాత్ర నోటిలో చేదు ఉండకూడదని ఫుల్లుగా నీళ్ళు తాగేసింది. తర్వాత చూస్తే మాత్రలు అక్కడే మిగిలిపోయాయి. కానీ,ఇయర్ బడ్స్‌లో ఒకటి మాయమైంది. ఈ ఘటన USAలోని ఉటాలో చోటు చేసుకుంది.

USAలోని ఉటాలో ఉన్న ఉంటున్న మహిళ బార్కర్‌ మార్నింగ్ వాక్‌కు వెళ్లి వచ్చింది. అయితే, అంతకుముందు టాబ్లెట్‌ వేసుకోవాల్సి ఉండగా, కాస్త ఆలస్యం జరిగింది. దాంతో హడావిడిగా నీళ్ల సీసా, విటమిన్లు మాత్రమే తీసుకుని వాకింగ్ కు వెళ్లింది. ఆమె తన భర్త ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పాడ్‌ను వెంటతీసుకెళ్లింది. వాకింగ్‌ చేస్తూ మ్యూజిక్‌ వినడం ఆమెకు రోజూ అలవాటు. అయితే..ఈ క్రమంలోనే తన స్నేహితులతో కబుర్లు చెబుతూ నడవడం ప్రారంభించారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత బార్కర్‌తో విటమిన్ పిల్ తీసుకోవాలని గుర్తు చేసుకుంటుంది.. వెంటనే నిల్చున్న చోటే ఆగిపోయి విటమిన్ పిల్ తెరిచిన తర్వాత, ఆమె తన వాటర్ బాటిల్ తీసి ముందుగా నీరు తాగింది. ఆ తర్వాత మాత్ర మింగేసింది. అది తాగిన తర్వాత తన చేతిలో ఏదో తగిలిందని చూసుకుంది..దాంతో ఒక్కసారిగా ఆమెకు షాక్‌ తగిలినంత పనైంది. చేతిలో విటమిన్‌ మాత్ర పట్టుకుని భర్త ఎయిర్‌పాడ్‌ మింగి నీళ్లు తాగినట్లుగా గ్రహించింది.

ఇంతలో ఐఫోన్‌ రింగ్ టోన్, మ్యూజిక్‌ పాట అన్నీ ఆమె కడుపులోపల ప్లే కావడం మొదలైంది. కానీ, ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్య రాలేదు. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె జరిగిన సంఘటనను భర్తకు వివరించింది. దాంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

అయితే, జరిగిన విషయం మొత్తం వారు టిక్‌టాక్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచిత్రమైన కామెంట్స్ కూడా వచ్చాయి. ఎయిర్‌పాడ్‌లను ఎలా తొలగించాలని చాలా మందిని అడిగారు. రియాక్షన్ కామెంట్ చూసి వారు కంగారుపడ్డారు. చాలా మంది వైద్యులను సంప్రదించారు. చాలా మంది డాక్టర్లు ఒక వారం పాటు వేచి ఉండాలని సూచిస్తున్నారు. మలం ద్వారా బయటకు రాకపోతే శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. కాగా, వారం తర్వాత ఆమె కడుపులోని ఎయిర్‌పాడ్‌లు సహజంగా కడుపు నుండి బయటకు వచ్చాయి. Tik Tok వీడియో ద్వారా ఈ సమాచారాన్ని షేర్ చేసిన తర్వాత మీ AirPod సరిగ్గా పని చేస్తుందా..? అంటూ నెటిజన్లు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట