Chandrababu Arrest: చంద్రబాబుకి బెయిల్ వస్తుందా.. రాదా..? కస్టడీకి ఇస్తారా..? కోర్టులో ఇవాళ కీలక విచారణ
Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు ఆయనకు సెప్టెంబర్ 22 వరకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే, చంద్రబాబు అరెస్టయి పది రోజులు గడిచింది. ఈ క్రమంలో ఆయనకు బెయిల్ కోసం చంద్రబాబు తరుపు లాయర్లు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు ఆయనకు సెప్టెంబర్ 22 వరకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే, చంద్రబాబు అరెస్టయి పది రోజులు గడిచింది. ఈ క్రమంలో ఆయనకు బెయిల్ కోసం చంద్రబాబు తరుపు లాయర్లు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకి బెయిల్ వస్తుందా.. రాదా.. మిగిలిన కేసుల్లో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటు హైకోర్ట్.. అటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్లపై ఇవాళ కీలక విచారణ జరగబోతోంది. వాటిల్లో తీర్పులు ఎలా వస్తాయనేది ఆసక్తిగా మారింది.
ఈ నేపథ్యంలో ఏపీలో ఇప్పుడు అందరి చూపు హైకోర్టు, ఏసీబీ కోర్టుల వైపు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ కోర్టుల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈనెల తొమ్మిదిన చంద్రబాబును అదుపులో తీసుకోవడం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్, రిమాండ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఒకసారి విచారించిన హైకోర్టు మరోసారి ఇవాళ విచారణ జరపనుంది.
క్వాష్ పిటీషన్..
తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చంద్రబాబు ఇప్పటికే ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ఇవాళ సీఐడీ కౌంటర్ వేయనుంది. ఆ తర్వాత ఇరువర్గాల వాదనలు జరగనున్నాయి.
అంగళ్లు కేసు..
మరోవైపు అన్నమయ్య జిల్లా అంగళ్లు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలోనూ చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది.
సీఐడీ పిటీషన్..
ఇక చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విషయంలోనూ ఇవాళ తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్వాష్ పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ నెల 18 వరకు కస్టడీకి ఇవ్వొద్దని హైకోర్ట్ ఆదేశించింది. అయితే క్వాష్ పిటిషన్‌పై హైకోర్ట్ తీర్పు ఆధారంగా కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది.
అటు హైకోర్టులోనూ, ఇటు ఏసీబీ కోర్టులోనూ కీలక పరిణామాలు జరగబోతున్నాయి. క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తుందా? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ లభిస్తుందా? వీటిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది సర్వత్రా తీవ్ర ఉత్కంఠగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..