YS Jagan in Tirumala: స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్.. వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. దేవదేవుడి పండుగకు ముక్కోటి దేవతలు తిరుమలకు దిగివస్తున్నారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు సాగుతాయి. రోజుకో రూపం.. పూటకో వాహన సేవతో భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు తిరుమల వెంకన్న. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి సోమవారం పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇవాళ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
CM YS Jagan In Tirupati: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరులు అందంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలకు ముక్కోటి దేవతలతో పాటు..భక్త కోటి కూడా ఏడుకొండలకు చేరుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు..రోజుకో రూపం..పూటకో వాహన సేవతో భక్తులను అనుగ్రహిస్తారు తిరుమల వెంకన్న. ఆదివారం నాడు అంకురార్పణ చేసిన వేద పండితులు.. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మలయప్ప స్వామి వారి సమక్షంలో గరుడ ధ్వజం ఎగురవేసి…బ్రహ్మోత్సవాలకు రా రండంటూ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్… ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.. ఈ సందర్భంగా జగన్‌కు ఆలయ ప్రధాన అర్చకులు పరివట్టం కట్టారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి ఊరేగింపు జరిగింది. సీఎం జగన్ ఈ వాహన సేవలో పాల్గొన్నారు. తిరుమల పర్యటనలో భాగంగా రెండో రోజు ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపీ బ్రేకు సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరంగనాయకుల మండపంలో సీఎం జగన్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. శ్రీవారి దర్శనం తర్వాత పద్మావతి అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఉన్నారు.
ఇక శ్రీవారి దర్శనం తర్వాత సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ 78 చెరువులకు హంద్రీనీవా నీరు విడుదల చేయనున్నారు. అనంతరం డోన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్.
శ్రీబేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద సీఎం వైయస్.జగన్‌కు పట్టువస్త్రంతో పరివట్టం కట్టిన తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు. pic.twitter.com/UMOdbMzfjm
— YSR Congress Party (@YSRCParty) September 18, 2023
కాగా.. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 6,700 మంది టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 650 కోట్ల రూపాయల ఖర్చుతో కట్టిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం దాన్ని తిరుపతి ప్రజలకు అంకితమిచ్చారు. ఏడు కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ ఫ్లై ఓవర్..శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బాగా ఉపయోగపడుతుందన్నారు జగన్. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన హాస్టల్స్ ప్రారంభించారు ముఖ్యమంత్రి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..