Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Cycle: రాత్రిళ్లు నిద్రపట్టక పోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.. మీకు అర్థమవుతుందా?

బిజీ లైఫ్‌స్టైల్‌, పని ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆధునిక జీవనశైలి కారణంగా నేటి కాలంలో చాలా మంది అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటున్నారు. నేటి కాలంలో ఇది చాలా సాధారణం అయిపోయింది. అయితే ఈ విధానం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేట్‌ నైట్‌ నిద్ర తమ జీవితాల్లో ఎంత నష్టాన్ని కలిగిస్తుందో చాలా మందికి తెలియదు. దీనిపై ఇటీవల ఓ అధ్యయనం జరిగింది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రాత్రిపూట తక్కువసేపు నిద్రపోయే..

Sleep Cycle: రాత్రిళ్లు నిద్రపట్టక పోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.. మీకు అర్థమవుతుందా?
Lifestyle Behavior
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 17, 2023 | 1:03 PM

బిజీ లైఫ్‌స్టైల్‌, పని ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆధునిక జీవనశైలి కారణంగా నేటి కాలంలో చాలా మంది అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటున్నారు. నేటి కాలంలో ఇది చాలా సాధారణం అయిపోయింది. అయితే ఈ విధానం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేట్‌ నైట్‌ నిద్ర తమ జీవితాల్లో ఎంత నష్టాన్ని కలిగిస్తుందో చాలా మందికి తెలియదు. దీనిపై ఇటీవల ఓ అధ్యయనం జరిగింది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రాత్రిపూట తక్కువసేపు నిద్రపోయే వ్యక్తులకు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట నిద్రపోయే వ్యక్తులకు ఇతర వ్యక్తుల కంటే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు 60 వేల మంది మహిళా నర్సులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. రాత్రులు పనిచేసే నర్సులు అనేక కారణాల వల్ల రాత్రి నిద్రపోరని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. పగటిపూట పని చేసేవారితో పోలిస్తే నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 19 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.

పగటిపూట ఆలస్యంగా మేల్కొని నిద్రపోయే వ్యక్తుల నిద్ర షెడ్యూల్‌కు అంతరాయం కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా శరీరం జీవక్రియ ప్రక్రియ క్షీణిస్తుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమై టైప్ 2 డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఆలస్యంగా నిద్రపోయేవారు లేదా ఉదయం ఆలస్యంగా మేల్కొనేవారి జీవక్రియలో చాలా తేడా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

టైప్ 2 డయాబెటిస్ అంటే ఏమిటి?

డయాబెటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ చాలా మందిలో జన్యుపరంగా వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల వస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో క్లోమం అవసరమైన విధంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.