Kota Student Suicides: కోటాలో ఆగని విద్యార్ధుల సూసైడ్స్.. విషం తాగి మరో విద్యార్ధిని ఆత్మహత్య

రాజస్థాన్‌లోని ప్రముఖ కోచింగ్‌ హబ్‌ కోటా విద్యార్ధుల సూసైడ్‌ స్పాట్‌గా మారుతోంది. గతకొంతకాలంగా కోటాలో చోటు చేసుకుంటున్న విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తాజాగా కోటాలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఏడాది అక్కడ సూసైడ్‌ చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 25కి చేరింది. సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్ధిని విషం సేవించి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విజ్ఞాన్‌ నగర్‌ పోలీస్‌ ఇన్‌ఛార్జ్‌ కౌశల్య..

Kota Student Suicides: కోటాలో ఆగని విద్యార్ధుల సూసైడ్స్.. విషం తాగి మరో విద్యార్ధిని ఆత్మహత్య
Kota Student Suicides
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 19, 2023 | 7:30 AM

కోటా, సెప్టెంబర్ 19: రాజస్థాన్‌లోని ప్రముఖ కోచింగ్‌ హబ్‌ కోటా విద్యార్ధుల సూసైడ్‌ స్పాట్‌గా మారుతోంది. గతకొంతకాలంగా కోటాలో చోటు చేసుకుంటున్న విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తాజాగా కోటాలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఏడాది అక్కడ సూసైడ్‌ చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 25కి చేరింది. సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్ధిని విషం సేవించి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విజ్ఞాన్‌ నగర్‌ పోలీస్‌ ఇన్‌ఛార్జ్‌ కౌశల్య తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌లోని మహువా జిల్లాకు చెందిన మృతురాలు ప్రియమ్‌ సింగ్‌ (17) ఒకటిన్నర ఏడాదిగా కోటాలో నీట్‌ యూజీకి కోచింగ్‌ తీసుకొంటోంది. ప్రియమ్‌ డాకనియ రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటోంది. అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటోన్న ప్రియమ్‌ సమీపంలోని కోచింగ్‌ సెంటర్‌లో ఏడాదిన్నర నుంచి నీట్‌కు శిక్షణ తీసుకొంటోంది. ఎప్పటి మాదిరిగానే ప్రియమ్‌ సోమవారం (సెప్టెంబర్ 18) ఉదయం కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె తన కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా కోచింగ్‌ సెంటర్‌లోనే వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురైంది. తోటి విద్యార్థులు కోచింగ్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆమెను తల్వాండిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రియమ్‌ చికిత్స పొందుతూ సాయంత్రం 6.45 గంటలకు మరణించినట్లు విజ్ఞాన్‌ నగర్‌ పోలీస్‌ ఇన్‌ఛార్జ్‌ కౌశల్య తెలిపారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్ధి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా విద్యార్థిని విషం సేవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు ప్రియాం కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత ఆమె గదిని సోదా చేయనున్నారు. బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె హాస్టల్‌ గదిలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. విద్యార్ధిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా కోటాలో గత రెండు వారాల్లో ఇది రెండో ఆత్మహత్య కావడం విశేషం. దీంతో ఈ ఏడాది విద్యార్ధుల బలవన్మరణాల సంఖ్య 25కి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.