Aditya L1: మరో ముందడుగు వేసిన ఆదిత్య ఎల్1.. డేటా సేకరించడం స్టార్ట్..

వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్‌1లోని స్టెప్స్‌ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ఆదిత్య ఎల్‌1 ఇవాళ కీలక దశకు చేరుకొని.. భూప్రదక్షిణ దశను ఎండ్‌ చేయనుంది. ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

Aditya L1: మరో ముందడుగు వేసిన ఆదిత్య ఎల్1.. డేటా సేకరించడం స్టార్ట్..
Solar Mission
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Sep 19, 2023 | 11:09 AM

ఆదిత్య ఎల్1కు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఇస్రో.. కీలక సమాచార సేకరణను స్టార్ట్ చేసినట్లు అనౌన్స్ చేసింది. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో పంపిన ఆదిత్య ఎల్1 సక్సెస్‌ఫుల్‌ దూసుకెళ్తుంది. ఆదిత్య ఎల్‌1 తాజాగా సరికొత్త మైలురాయిని చేరినట్లు ఇస్రో వెల్లడింది. దీనిపై అమర్చిన స్టెప్స్‌ అనే పరికరం పరిశోధనలను మొదలుపెట్టిన విషయాన్ని ఇస్రో పంచుకుంది. ఆదిత్య ఎల్‌1 డేటాను సేకరించడం స్టార్ట్ చేసినట్లు అనౌన్స్ చేసింది ఇప్రో. అది భూమికి దాదాపు 50 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్‌, ఎనర్జిటిక్‌ అయాన్స్‌, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తున్నటు తెలిపింది. అయితే ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.

వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్‌1లోని స్టెప్స్‌ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ఆదిత్య ఎల్‌1 ఇవాళ కీలక దశకు చేరుకొని.. భూప్రదక్షిణ దశను ఎండ్‌ చేయనుంది. ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇది సన్‌-ఎర్త్‌ లగ్రాంజ్‌ 1కు చేరుకుంటుంది. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఈ పాయింట్‌లో సూర్యుడు, భూమి గురత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకొని ఏదైనా స్థిరంగా ఉండవచ్చని చెప్తున్నారు సెంటిస్టులు.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్‌ పాయింట్లను గుర్తించారు. వీటిల్లో భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్‌1 తొలి లగ్రాంజ్‌ పాయింట్‌కు వెళుతోంది. ఈ కేంద్రం భూమితో పాటు సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది.. కాబట్టి సౌర పరిశీలనకు ఇది ఎంతగానో తోడ్పడనుంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని పరిశీలించడానికి వీలుపడుతుందని చెప్పింది ఇస్రో. ఇక ఈ ఆదిత్య ఎల్1 శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌‌తో పాటు దాని వెలుపల ఉండే కరోనాపై విస్తృత పరిశోధనలు చేయనున్నాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి ఇవి పరిశోధనలు జరపనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..