Mukesh Ambani: ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి ఎవరో తెలుసా.. అతని శాలరీ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

టెలికాం నుండి రిటైల్ వరకు అన్ని రకాల వ్యాపార రంగాల్లో ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోంది. అంతేకాదు ఆధునిక సౌకర్యాలతో ఉన్న ఇల్లు. సొంతగా ఫ్లైట్ సహా లగ్జరీ లైఫ్ ముఖేఫ్ ఫ్యామిలీ సొంతం. అయితే ముఖేష్ అంబానీ జీతం ఆయన కంపెనీ ఉద్యోగుల కంటే తక్కువని తెలుసా..! నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. ముఖేష్ అంబానీ కంటే..  రిలయన్స్ గ్రూప్‌లోని మరో ఉన్నత స్థాయి ఉద్యోగి జీతం దాదాపు ఒకటిన్నర రెట్లు అధికం.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి ఎవరో తెలుసా.. అతని శాలరీ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Nikhil Meswani
Follow us
Surya Kala

|

Updated on: Sep 12, 2023 | 2:46 PM

భారతదేశంలో కలియుగ కుబేరుడు.. అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని వ్యాపార రంగంలో అడుగు పెట్టిన ముఖేష్ అంబానీ విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సక్సెస్ ఫుల్  వ్యాపారవేత్త. దేశ వ్యాప్తంగా అనేక రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టెలికాం నుండి రిటైల్ వరకు అన్ని రకాల వ్యాపార రంగాల్లో ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోంది. అంతేకాదు ఆధునిక సౌకర్యాలతో ఉన్న ఇల్లు. సొంతగా ఫ్లైట్ సహా లగ్జరీ లైఫ్ ముఖేఫ్ ఫ్యామిలీ సొంతం. అయితే ముఖేష్ అంబానీ జీతం ఆయన కంపెనీ ఉద్యోగుల కంటే తక్కువని తెలుసా..! నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. ముఖేష్ అంబానీ కంటే..  రిలయన్స్ గ్రూప్‌లోని మరో ఉన్నత స్థాయి ఉద్యోగి జీతం దాదాపు ఒకటిన్నర రెట్లు అధికం. అయితే ఆ ఉద్యోగి  ముఖేష్ అంబానీ కొడుకు కూడా కాదు.  ఆ ఉద్యోగి జీతం కంపెనీలోని అందరి ఉద్యోగుల కంటే ఎక్కువ.

RILలో అత్యధిక జీతం పొందే వ్యక్తి ఎవరంటే..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో అత్యధిక జీతం ఆర్జించే వ్యక్తి నిఖిల్ మెస్వానీ. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉద్యోగుల సంఖ్య 2 లక్షల 30 వేలు. అందరిలోకీ నిఖిల్ మెస్వానీ దే అత్యధిక పారితోషికం. ఇతనే ఎక్కువగా జీతం తీసుకుంటున్నాడు.

నిఖిల్ మేస్వానీ ఎవరంటే..?

నిఖిల్ మెస్వానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అయితే అతనికి మరో గుర్తింపు ఉంది. నిఖిల్ మేస్వానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మేనల్లుడు. అతను RIL  పెట్రోకెమికల్ వ్యాపారానికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ముఖేష్ అంబానీకి చెందిన IPL క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్‌ను కూడా పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నిఖిల్ మేస్వానీ జీతం ఎంత?

ఆర్‌ఐఎల్ పెట్రోకెమికల్ బిజినెస్ హెడ్ నిఖిల్ మెస్వానీ ప్రస్తుతం వార్షిక వేతనం రూ.24 కోట్లు. ఇది ఆర్‌ఐఎల్ చైర్మన్ జీతం కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ.

ముఖేష్ అంబానీ జీతం ఎంత?

ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముకేశ్ అంబానీ గత 3 సంవత్సరాలుగా జీతం లేకుండా పనిచేస్తున్నారు. వచ్చే ఐదేళ్లు జీతం లేకుండా పని చేస్తానని ముఖేష్ అంబానీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..